Heavy Rains in AP: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. 3 రోజులు భారీ వర్షాలు..
- ఏపీ తీరానికి మరో వాయుగుండం ముప్పు..
- దక్షిణ అండమాన్ తీరంలో అల్పపీడనం..
- దక్షిణ కోస్తా.. రాయల సీమ జిల్లాలపై అధిక ప్రభావం..
- మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rains in AP: దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. రెండు రోజుల్లో అది వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. నేటి నుంచి ఏపీ, తెలంగాణలోకి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రాయలసీమలో భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది. ఈ అల్పపీడనం తుఫాన్‌గా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడి, 27 నాటికి తమిళనాడు లేదా ఏపీలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Also: Tilak Varma Century: వరుసగా మూడో సెంచరీ.. తొలి బ్యాటర్‌గా తిలక్ వర్మ రికార్డు!
Also Read
- CM Chandrababu : వైద్య రంగంలో సరికొత్త విప్లవం 'సంజీవని'.. ఇంటివద్దకే ఆధునిక వైద్యం.!
- Arava Sridhar Resignation: పవన్ కల్యాణ్‌ను కలిసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. పదవికి రాజీనామా..
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
- AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ!.
ఇక.. అల్పపీడనం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, నంద్యాల, పశ్చిమ గోదావరి, పల్నాడు, కోనసీమ, అల్లూరి సీతారామరాజు , ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇక తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్‌లో రాత్రి పూట చలి మరింతగా పెరగనుంది.
Read Also: Tilak Varma Century: వరుసగా మూడో సెంచరీ.. తొలి బ్యాటర్‌గా తిలక్ వర్మ రికార్డు!
అయితే, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తూ దక్షిణ బంగాళాఖాతంలోని నవంబర్ 25న వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.. వాయువ్య దిశగా కదులుతూ తదుపరి 2 రోజుల్లో తమిళనాడు-శ్రీలంక తీరాలు వైపు వెళ్లే అవకాశం ఉందని పేర్కొంది.. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనావేసింది..
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?