NTV Telugu Site icon

Heavy Rains in AP: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. 3 రోజులు భారీ వర్షాలు..

Rains

Rains

Heavy Rains in AP: దక్షిణ అండమాన్‌ సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. రెండు రోజుల్లో అది వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. నేటి నుంచి ఏపీ, తెలంగాణలోకి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రాయలసీమలో భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది. ఈ అల్పపీడనం తుఫాన్‌గా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడి, 27 నాటికి తమిళనాడు లేదా ఏపీలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

Read Also: Tilak Varma Century: వరుసగా మూడో సెంచరీ.. తొలి బ్యాటర్‌గా తిలక్ వర్మ రికార్డు!

ఇక.. అల్పపీడనం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్‌ కడప, నంద్యాల, పశ్చిమ గోదావరి, పల్నాడు, కోనసీమ, అల్లూరి సీతారామరాజు , ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇక తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్‌లో రాత్రి పూట చలి మరింతగా పెరగనుంది.

Read Also: Tilak Varma Century: వరుసగా మూడో సెంచరీ.. తొలి బ్యాటర్‌గా తిలక్ వర్మ రికార్డు!

అయితే, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తూ దక్షిణ బంగాళాఖాతంలోని నవంబర్ 25న వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.. వాయువ్య దిశగా కదులుతూ తదుపరి 2 రోజుల్లో తమిళనాడు-శ్రీలంక తీరాలు వైపు వెళ్లే అవకాశం ఉందని పేర్కొంది.. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనావేసింది..