Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh Tax Revenue: ఆంధ్రప్రదేశ్ పన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి నమోదైంది. ఈ ఏడాది ఆగస్టు నెలలో రాష్ట్ర పన్నుల ఆదాయం 18.05 శాతం పెరిగినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గతేడాది ఆగస్టుతో పోల్చితే ఈసారి పన్నుల వసూళ్లలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. గతేడాది ఆగస్టు నెలలో రాష్ట్రానికి రూ.21,558.09 కోట్ల పన్నుల రాబడి వచ్చింది. ఈ ఏడాది ఇదే నెలలో పన్నుల ఆదాయం రూ.25,449.80 కోట్లకు చేరింది. గతేడాదితో పోలిస్తే ఆగస్టులో రూ.3,891.71 కోట్ల అదనపు ఆదాయం నమోదైంది.
నికర పన్నుల వసూళ్లలోనూ సుమారు 18 శాతం వృద్ధి నమోదైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పన్నుల వసూళ్లు పెరగడానికి వాణిజ్య పన్నుల శాఖ చేపట్టిన పలు సాంకేతిక చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నాయి. వాణిజ్య పన్నుల శాఖలో ప్రభుత్వం ఏఐ ఆధారిత స్క్రూటినీ విధానాన్ని ప్రవేశపెట్టింది. పన్ను చెల్లింపుల్లో అక్రమాలు, వ్యత్యాసాలను గుర్తించడంతో పాటు వసూళ్లను మెరుగుపరిచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా పన్నులు చెల్లించే విధానాన్ని మరింత సరళతరం చేయడం కూడా ఆదాయం పెరగడానికి కారణమవుతోందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సాంకేతికత వినియోగం, ఏఐ ఆధారిత పరిశీలన, పన్ను చెల్లింపుల సరళీకరణతో భవిష్యత్తులో రాష్ట్ర పన్నుల ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Also Read
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
-
SCO Summit: పాక్ ప్రధాని ముందే ఉగ్రవాదంపై మోడీ స్ట్రాంగ్ మెసేజ్
-
Tilak Varma: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. తిలక్ వర్మకు కెప్టెన్సీ పగ్గాలు..!
-
Imran Khan Gets Relief: ఇమ్రాన్ ఖాన్కు పాక్ కోర్టులో భారీ ఊరట..
-
Mamata Banerjee: మమతా బెనర్జీ ఇంట్లో విషాదం.. మేనకోడలు ఆత్మహత్య
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!