Site icon NTV Telugu

Andhra Pradesh: ఏపీ రెవెన్యూ శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు.. రెండు ప్రతిష్టాత్మక అవార్డులు సొంతం

Anagani Satya Prasad

Anagani Satya Prasad

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.. ఏపీ రెవెన్యూ శాఖకు రెండు స్కోచ్‌ అవార్డులు సొంతం చేసుకుంది.. 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక స్కోచ్ సమ్మిట్ లో అవార్డుల ప్రదానం జరిగిందని తెలిపారు రాష్ర్ట రెవెన్యూ, రిజిస్ర్టేషన్ మరియు స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్.. ORCMS (ఆన్ లైన్ కోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్), రీసర్వే 2.0కు స్కోచ్ అవార్డులు వచ్చాయని వెల్లడించారు.. వచ్చే నెల 20వ తేదీన ఢిల్లీలో అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని తెలిపారు అనగాని..

Read Also: Shubhanshu Shukla: అంతరిక్ష కేంద్రం నుంచి భారత్ అందంగా కనిపించింది: శుభాంషు శుక్లా

ప్రజలకు మెరుగైన సేవలు అందించినందుకు ఏపీ రెవెన్యూ శాఖకు స్కోచ్ అవార్డులు వచ్చాయని వివరించారు మంత్రి అనగాని.. రెవెన్యూ వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక సంస్కరణలకు పెద్ద పీట వేసిన ప్రతిష్టాత్మక స్కోచ్ సమ్మిట్ అన్నారు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అమలు చేస్తున్న రెవెన్యూ సంస్కరణలకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం ఆనందకరం అన్నారు.. రెవెన్యూ పరిపాలనను ప్రజలకు చేరువ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉత్తమ విధానాలకు ఈ అవార్డులు నిదర్శనం అన్నారు.. రెవెన్యూ శాఖ ఉద్యోగులు, అధికారులు చేసిన కృషి కారణంగానే అవార్డులు దక్కాయని పేర్కొన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్..

Exit mobile version