Site icon NTV Telugu

Andhra Pradesh: పులులు, ఏనుగుల సంరక్షణకు చర్యలు.. అదనపు నిధులు విడుదల

Ap Wildlife Conservation

Ap Wildlife Conservation

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అంతరించిపోతున్న పులులు, ఏనుగుల సంరక్షణకు ప్రభుత్వం భారీ నిధులను కేటాయించింది. పులుల రక్షణ కోసం అమలు చేస్తున్న ప్రాజెక్ట్ టైగర్, అలాగే ఏనుగుల సంరక్షణకు చేపట్టిన ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కోసం అదనంగా రూ.4 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ అదనపు నిధులు కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ రెండు పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అటవీ శాఖ సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తదుపరి చర్యలు చేపట్టాలని అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌కి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే విడుదల చేశారు.

Read Also: Ibomma Ravi : కన్ఫెషన్ రిపోర్ట్‌లో వెలుగులోకి సంచలన వివరాలు

Exit mobile version