Paddy Procurement: ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోళ్లు భారీగా పెరిగాయి.. ఖరీఫ్ 2025-26 ధాన్యం కొనుగోళ్లపై తాజా వివరాలను పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇప్పటివరకు ఖరీఫ్ 2025-26లో 18.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది అన్నారు. 2,85,125 మంది రైతుల నుంచి ధాన్యం సేకరించామని మంత్రి తెలిపారు. రైతులకు ఇప్పటి వరకు 4,085.37 కోట్లు చెల్లించగా, మొత్తం కొనుగోలు విలువ 4,345.56 కోట్లు చేరింది అన్నారు. ఈ ఒక్కరోజు ధాన్యం కొనుగోలు 67,822 మెట్రిక్ టన్నులకు చేరింది అని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ధాన్యం కొనుగోళ్లలో భారీ పెరుగుదల ఉంది అన్నారు. ధాన్యం కొనుగోలు 32.3 శాతం, రైతుల భాగస్వామ్యం 40.7 శాతం, కొనుగోలు విలువ 36.3 శాతం పెరిగింది అన్నారు.. గత ఏడాది 2.02 లక్షల రైతులు MSP ప్రయోజనం పొందగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 2.85 లక్షలకు పెరిగింది అని వివరించారు.. కొనుగోలు కేంద్రాల్లో చెల్లింపుల వేగం పెరగడంతో 2.67 లక్షల మందికి ఇప్పటి వరకు చెల్లింపులు పూర్తయ్యాయని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
Read Also: Deputy CM Pawan Kalyan: హిందూ సంప్రదాయాలపై వచ్చే తీర్పుల్లో ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు?
