Site icon NTV Telugu

Minister Nara Lokesh: ఇంటర్‌ విద్యపై లోకేష్‌ సమీక్ష.. కీలక ఆదేశాలు

Naralokesh

Naralokesh

Minister Nara Lokesh: ఇంటర్ విద్యలో యూడైస్.. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేష్ ఎన్‌రోల్‌మెంట్‌ను సమర్థవంతంగా చేపట్టాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ విద్యపై ఉండవల్లి నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి లోకేష్.. అయితే, ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో 5 లక్షల 965 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. పదో తరగతి పూర్తైన విద్యార్థులు ఇంటర్ లేదా వృత్తి విద్యా కోర్సుల్లో తప్పనిసరిగా ప్రవేశం పొందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Read Also: MLA Kaushik Reddy: పేదల జీవితాలతో రేవంత్ రెడ్డి చెలగాటం ఆడొద్దు..

ఇక, టెన్త్‌ పూర్తి చేసిన ఏ విద్యార్థి ఇంట్లో ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు మంత్రి లోకేష్… ప్రతి విద్యార్థి ఎక్కడ ప్రవేశం పొందారో ట్రాక్ చేయాలని, పాఠశాల విద్యతోనూ సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో నిరక్షరాస్యులకు అక్షర ఆంధ్ర. ప్రాజెక్ట్ అఆ కార్యక్రమం ఆగష్టు 7వ తేదీ నుంచి ప్రారంభించనన్నట్లు అధికారులు వివరించారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ప్రతి ఏడాది ఐఐటీ, ఎన్ఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఇబ్బందులు తలెత్తకుండా లాంగ్వేజ్ సబ్జెక్ట్ మార్కులను మిగతా సబ్జెక్టుల మార్కుల సగటుగా ఉండాలని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఆదేశించారు.

Exit mobile version