Heavy Rain Alert: ఏపీపై నైరుతి రుతుపవనాల ప్రభావం.. భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుగా కదులుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం వరకు రుతుపవనాలు విస్తరించినట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నేడు అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అలాగే రేపు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు కోస్తా ఆంధ్రప్రదేశ్ అంతటా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు వడగాల్పులు కూడా ఉండే అవకాశం ఉందన్నారు. ఈ కారణంగా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున కోస్తా తీరం వెంబడి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. తీరప్రాంత ప్రజలు, రైతులు, మత్స్యకారులు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ కేంద్రం సూచించింది.
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
తాజావార్తలు
-
AP Schools: ఏపీలో మోగనున్న బడిగంట.. రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు
-
Pooja Hegde: సీఎంపైనే పూజా హెగ్డే ఆశలు!
-
Heavy Rain Alert: ఏపీపై నైరుతి రుతుపవనాల ప్రభావం.. భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ
-
Nikhil Chaudhary: కాటేరమ్మ కొడుకు స్థానంలో నిఖిల్ చౌదరి.. రికార్డు అదిరిపోయింది..
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్‌కు బిగ్ షాక్.. రాజ్యసభ ఆశలు ఆవిరి
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!