Heavy Rain Alert: ఏపీపై నైరుతి రుతుపవనాల ప్రభావం.. భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుగా కదులుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం వరకు రుతుపవనాలు విస్తరించినట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నేడు అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అలాగే రేపు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు కోస్తా ఆంధ్రప్రదేశ్ అంతటా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు వడగాల్పులు కూడా ఉండే అవకాశం ఉందన్నారు. ఈ కారణంగా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున కోస్తా తీరం వెంబడి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. తీరప్రాంత ప్రజలు, రైతులు, మత్స్యకారులు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ కేంద్రం సూచించింది.
Also Read
తాజావార్తలు
-
Chairman’s Desk : కేంద్రం అనవసరంగా సర్‌ను వివాదం చేసుకుందా? ప్రతిపక్షాలు ఈ టెంపోను కొనసాగించగలవా?
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!