AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్‌వేవ్స్ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Heatwave Alert: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వడగాలులు ప్రభావం చూపనున్నాయని, దాదాపు వారం రోజుల పాటు హీట్‌వేవ్స్ కొనసాగనున్నాయని అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తేమ శాతం తగ్గిపోవడంతో పొడిగాలుల ప్రభావం మరింత ఎక్కువగా ఉండనుంది. దీంతో ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు.
ఇక, ఈ నెల 19న మయన్మార్ తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. అయితే దాని ప్రభావం తక్షణంగా రాష్ట్రంపై కనిపించే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ, వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశముందని చెబుతున్నారు. వైద్య నిపుణులు కూడా ప్రజలకు కీలక సూచనలు చేస్తున్నారు. మధ్యాహ్న సమయంలో బయట తిరగకుండా ఉండటం, ఎక్కువగా నీరు తాగడం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి ద్రవాలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!