Site icon NTV Telugu

Survey on Work From Home: సర్కార్‌ కీలక నిర్ణయం.. వర్క్‌ ఫ్రమ్‌ హోంపై సర్వే..

Survey On Work From Home

Survey On Work From Home

Survey on Work From Home: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. వర్క్‌ ఫ్రమ్‌ హోంపై కూడా సర్వే నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చింది.. వర్క్ ఫ్రమ్ హోమ్ కు సంబంధించి ప్రభుత్వం సర్వే నిర్వహించనుంది.. ప్రతి ఇంట్లో 18 నుంచి 50 ఏళ్ల లోపు ఉన్నవారి వివరాలను ఈ సర్వే ద్వారా సేకరిస్తారు.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో ఈ సర్వే నిర్వహించనున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా టెక్నీకల్ స్కిల్.. విద్యార్హతలు.. ప్రస్తుతం చేస్తున్న పనికి సంబంధించి వివరాల సేకరిస్తారు.. మార్చి 10వ వరకు సర్వే నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం.. అయితే, వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ మరింత అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది.. ప్రస్తుతం చేస్తున్న వర్క్‌తో పాటు మెరుగైన అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.. సర్వే తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కు ఎక్కువ మంది ఆసక్తి చూపితే.. ప్రత్యేక సెంటర్లను కూడా ఏర్పాటు దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.. బ్రాండ్ బ్యాండ్ కనెక్టవిటీ.. స్పీడ్ ఇంటర్ నెట్.. తగిన వసతి కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టనుంది..

Read Also: YS Jagan: వైరల్ ఫీవర్‌తో బాధపడుతోన్న జగన్‌.. అయినా రాజారెడ్డి ఐ సెంటర్‌ ప్రారంభోత్సవం

కాగా, ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి తర్వాత దిగ్గజ కంపెనీలు సైతం వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ మోడ్‌లోకి వెళ్లియి.. ఇప్పటికే పలు కంపెనీల్లో ఇది కొనసాగుతున్నాయి.. ఇంకా కొన్ని సంస్థల్లో వారానికి ఒకటి రెండు సార్లు వర్క్‌ ప్లేస్‌కు వస్తే సరిపోతుంది.. మిగతా రోజుల్లో ఇంటి నుంచే పనిచేసుకునే వెసులుబాటు కూడా కల్పించాయి.. అయితే, ఉద్యోగ కల్పనపై దృష్టిసారించిన ఏపీలోని కూటమి ప్రభుత్వం.. ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా పలు సంస్థలను ఆహ్వానించింది.. ఇదే సమయంలో.. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు మొగ్గుచూపే వారికి సైతం ప్రత్యేక ఉపాధి కల్పనపై ఫోకస్‌ పెట్టినట్టుగా తెలుస్తోంది.. అందులో భాగంగానే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌పై సర్వేకు సిద్ధమవుతోంది.. ఇందులో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ తో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీయనుంది సర్కార్..

Exit mobile version