Site icon NTV Telugu

AP Cabinet Emergency Meeting: ఏపీ కేబినెట్‌ అత్యవసర భేటీ.. కీలక నిర్ణయాలు ఉంటాయా..?

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet Emergency Meeting: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎల్లుండి కేబినెట్‌ సమావేశం జరగనుంది.. ఈ కేబినెట్‌ భేటీ అత్యవసరం సమావేశంగానే చెప్పుకోవాలి.. ఎందుంటే ఇటీవలే కేబినెట్‌ సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. ఇప్పుడు ఉన్నట్టుండి మళ్లీ కేబినెట్‌ సమావేశం కానుడడంతో.. ఈ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.. అయితే, కేబినెట్‌ సమావేశం అజెండా మీదా ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు..

Read Also: IND-W vs NEP-W: ఆసియా కప్లో భారత్ మూడో విజయం.. నేపాల్పై విక్టరీ

కాగా, ఈ రోజు లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌2024-25ని ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌.. యూనియన్‌ బడ్జెట్‌లో ఏపీ మంచి కేటాయింపులే దక్కాయి.. బడ్జెట్‌ 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై వరాల జల్లు కురిసింది. రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు చెప్పారు. అంతేకాదు అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సంపూర్ణ సాయం చేస్తామని తెలిపారు. ఏపీ రాష్ట్రం, రైతులకు పోలవరం జీవనాడి అని పేర్కొన్నారు. భారత ఆహార భద్రతకు పోలవరం ఎంతో కీలకమైందని నిర్మలమ్మ వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేస్తామన్నారు. విభజన చట్టం ప్రకారం.. పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామన్నారు. హైదరాబాద్‌-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి ప్రత్యేక నిధులు, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం చేస్తామని నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్న విషయం విదితమే. అయితే, ఈ కేటాయింపులపై విపక్షాలు విమర్శలు కూడా చేస్తున్నాయి.. మరోవైపు.. ఏపీ పాలిటిక్స్‌ ఢిల్లీ చేరాయి.. ఈ నేపథ్యంలో జరగనున్న కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది..

Read Also: Union Budget 2024: స్మార్ట్‌ఫోన్‌ కొనాలనే వారికి శుభవార్త.. ఆ ఫోన్లకు కస్టమ్స్ సుంకం తగ్గింపు

మరోవైపు.. తాజాగా జరిగిన కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం విదితమే.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.. కొత్త ఇసుక విధానానికి కేబినెట్ గ్నీన్‌ సిగ్నల్ ఇచ్చింది.. కొత్త ఇసుక పాలసీపై త్వరలో విధి విధానాలను రూపొందించనుంది ఏపీ ప్రభుత్వం.. మరోవైపు.. పౌర సరఫరాల శాఖ రూ. 2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం.. ఎన్సీడీసీ నుంచి రూ. 3200 కోట్ల రుణానికి వ్యవసాయ, సహకార కార్పొరేషన్లకు ప్రభుత్వ గ్యారెంటీకి కేబినెట్ పచ్చజెండా ఊపింది.. ఇక, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా చర్చించిన విషయం విదితమే.

Exit mobile version