NTV Telugu Site icon

AP and TG Officials Meeting: ఏపీలో తొలిసారిగా రెండు రాష్ట్రాల అధికారుల భేటీ.. వీటిపై ఫోకస్‌

Ap And Tg Cs

Ap And Tg Cs

AP and TG Officials Meeting: ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు భేటీ అయ్యారు. ఏపీ ఐఐసీ కార్యాలయంలో ఏపీ, తెలంగాణ అధికారుల కమిటీ సమావేశం అయ్యింది.. ఏపీ ఐఐసీ కార్యాలయానికి ఒకే కారులో వచ్చారు ఏపీ సీఎస్ నీరభ్ కుమార్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి.. ఆ తర్వాత సమావేశం ప్రారంభమైంది.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారమే అజెండాగా ఈ సమావేశం జరుగుతోంది.. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూలు సంస్థల ఆస్తుల పంపకాలపై చర్చించనుంది సీఎస్‌ల కమిటీ.. విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల పరస్పర మార్పిడి, వృత్తి పన్ను పంపకంపై అధికారుల కమిటీ చర్చిస్తోంది..

Read Also: Under 19 Asia Cup: జపాన్‌‭కు ఇచ్చిపడేసిన భారత్.. అమన్ అజేయ సెంచరీ

ఉమ్మడి సంస్థల ఖర్చులను తిరిగి చెల్లించే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉండగా.. విభజన పూర్తి కాని సంస్థలకు చెందిన నగదు నిల్వలపైనా అధికారుల కమిటీలో చర్చ సాగనుంది.. షెడ్యూలు 9, 10లోని సంస్థల బ్యాంకు ఖాతాల్లో పంపకం కాకుండా మిగిలిపోయిన 8 వేల కోట్ల అంశంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు.. తెలంగాణా నుంచి ఆ రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి రఘునందన్ రావు ఈ సమావేశానికి హాజరు కాగా.. ఏపీ నుంచి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ , ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్ , సాధారణ పరిపాలన శాఖ సురేష్‌ కుమార్, బాబు.ఏ హాజరయ్యారు..