Quantum Valley: అమరావతిలో క్వాంటం వ్యాలీకి 50 ఎకరాల భూమి కేటాయింపు..
- అమరావతిలో క్వాంటం వ్యాలీ కోసం 50 ఎకరాల భూమి కేటాయింపు..
- 2 ఎకరాల్లో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం..
- సీఆర్డీఏ కార్యాలయం పక్కనే సీడ్ యాక్సెస్ రోడ్ భవనం నిర్మాణానికి భూమి కేటాయింపు..
- క్వాంటం భవన నిర్మాణానికి టెండర్లు ఆహ్వానం...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Quantum Valley: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో క్వాంటం టెక్నాలజీ రంగంలో కీలక అడుగు పడింది. క్వాంటం వ్యాలీ అభివృద్ధికి ప్రభుత్వం 50 ఎకరాల భూమి కేటాయించింది. ఇందులో భాగంగా, రెండు ఎకరాల్లో అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సీఆర్డీఏ కార్యాలయానికి సమీపంలోని సీడ్ యాక్సెస్ రోడ్ పక్కనే భవన నిర్మాణం కోసం భూమి కేటాయింపు పూర్తయింది. ఈ నిర్మాణ పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ నెల 6తో టెండర్ల దాఖలు గడువు ముగియనుంది.
Read Also: Bollywood : హిందీలో ఆరు సినిమాలతో షేకాడిస్తున్న పాల బ్యూటీ
Also Read
- Nadendla Manohar: మనమంతా పవన్ కల్యాణ్ కోసమే.. గ్రూప్ రాజకీయాలు వద్దు..
- Pawan Kalyan: నీట్ నిరసనలపై పవన్ కీలక వ్యాఖ్యలు.. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి..
- Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
- Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
అయితే, శాశ్వత భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు, రాజధాని పరిధిలోని ఒక ప్రైవేట్ యూనివర్శిటీలో తాత్కాలిక క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం సెంటర్‌ను రాయపూడిలో నిర్మిస్తున్న శాశ్వత భవనానికి తరలించనున్నారు. ఇక, ప్రతిపాదిత క్వాంటం భవనం గ్రీన్ బిల్డింగ్ రూపకల్పనతో Z+1 ఫ్లోర్ డిజైన్‌లో నిర్మించనున్నారు. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 4,201 చదరపు మీటర్లు కాగా.. గ్రౌండ్ ఫ్లోర్: 1,990 చద.మీ. ఫస్ట్ ఫ్లోర్: 1,996 చద.మీ.. బేస్మెంట్: 210 చద.మీ. అదనంగా: హెడ్‌రూమ్ 109 చద.మీ., డెక్ ఏరియా 130 చద.మీటర్లుగా ఉండనుంది..
క్వాంటం కంప్యూటింగ్ ప్రాజెక్ట్ అమలులో టిసిఎస్ సాంకేతిక భాగస్వామిగా, ఎల్ అండ్ టీ నిర్మాణ సంస్థగా పనిచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మూడు కంపెనీలతో ఒప్పందాలు ఇప్పటికే పూర్తయ్యాయి. భవన నిర్మాణ వ్యయాన్ని సీఆర్డీఏ మరియు ఐటీ అండ్ ఈ శాఖలు సంయుక్తంగా భరించనున్నట్లు టెండర్ నిబంధనల్లో పేర్కొన్నారు. ఇదే క్రమంలో ప్రభుత్వం ఇప్పటికే క్వాంటం టెక్నాలజీ పాలసీని విడుదల చేసి, అమరావతిని జాతీయ క్వాంటం ఇన్నోవేషన్ హబ్‌గా అభివృద్ధి చేయాలని స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్‌తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్‌హౌస్‌కు జెలెన్స్కీ.. ట్రంప్‌తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!