Ambati Rambabu Granted Bail: అంబటి రాంబాబుకు బెయిల్‌ మంజూరు.. ట్విస్ట్‌ ఏంటంటే..?

  • అంబటి రాంబాబుకి బెయిల్‌ మంజూరు చేసిన స్పెషల్‌ మొబైల్‌ కోర్టు..
  • చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అంబటికి బెయిల్..
  • ఇదే కేసులో రాజమండ్రి జైలులో రిమాండ్‌లో ఉన్న అంబటి..
  • పోలీసుల కస్టడీ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు..
  • మరో కేసులో అంబటికి ఈ నెల 22 వరకు రిమాండ్‌..
Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu Granted Bail: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్‌ మంజూరు చేసింది కోర్టు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో బెయిల్ మంజూరు అయ్యింది. అంబటికి ఈ బెయిల్‌ను గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు మంజూరు చేసింది.. అయితే, ఇదే కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు అంబటి రాంబాబు.. మరో కేసులో ఈ నెల 22 వరకు కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో.. ఈ కేసులో బెయిల్‌ మంజూరు అయినా.. ఆయన జైలులోనే ఉండాల్సిన పరిస్థితి..

Read Also: Miheeka Bajaj : పాత గొడవలు పక్కనపెట్టి.. ‘బాలీవుడ్ స్టార్’పై రానా భార్య మిహీకా ఎమోషనల్ పోస్ట్!

మరోవైపు.. పోలీసులు అంబటిని మరోసారి కస్టడీకి తీసుకోవాలని పిటిషన్ చేసినా, మొబైల్ కోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో అంబటి బెయిల్‌పై విడుదలయ్యే అవకాశం వచ్చినా.. మరో కేసులో రిమాండ్‌ ఉండడంతో.. ఆయన జైలులోనే ఉండాల్సిన పరిస్థితి.. ఇక, గతేడాది నవంబర్ 12న పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన ఆరోపణలపై అంబటి రాంబాబుకి రిమాండ్ విధించారు. ఈ కేసు కూడా ప్రస్తుతం ఈ నెల 22 వరకు రిమాండ్‌ కొనసాగుతోంది. అంటే.. మెడికల్ కాలేజీని పీపీపీ విధానంలో నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనకు సంబంధించిన కేసులో అంబటి రాంబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో వాదనలు విన్న అనంతరం స్పెషల్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మరోవైపు.. అంబటి రాంబాబు పై 35 క్వాష్ పిటిషన్ల విచారణను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. కీలక ప్రశ్నలు లేవనెత్తింది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 35 కేసులు నమోదయ్యాయి. అయితే, అంబటి రాంబాబు వీటిని క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులపై విచారణ జరుగుతుండగా, హైకోర్టు పోలీసులకు కీలక సూచనలు చేసింది. విచారణలో BNSS 35(3) ప్రొసీజర్‌ని పాటించాలని, తుది నిర్ణయం వెలువడే వరకు తొందరపాటు చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ఆదేశించింది. అయితే, ఒకే విషయంపై 35 FIRలు నమోదు చేయడం ఏంటి? అని ప్రశ్నించింది హైకోర్టు.. అంబటి రాంబాబు తరఫున హాజరైన లాయర్ కోర్టుకు చెప్పిన వివరాల్లో, ఒకే అంశంపై 35 FIRలు నమోదు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. కానీ, ప్రభుత్వం తరపున వెలువడిన వాదనలో, వేర్వేరు ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని ఈ FIRలు అందుకున్నట్టు కోర్టుకు తెలియజేశారు. దీంతో కోర్టు ఆ అంశాన్ని పరిశీలిస్తోంది.. ఈ కేసులపై తదుపరి విచారణను ఏపీ హైకోర్టు మార్చి 2వ తేదీకి వాయిదా వేసింది.