Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు

Narayana

Narayana

Amaravati Land Pooling: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. సీఆర్డీఏ అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లతో సమావేశమైన మంత్రి.. రాజధానిలో జరుగుతున్న భూసమీకరణ ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ల్యాండ్ పూలింగ్‌కు నోటిఫై చేసిన భూముల్లో ఇంకా ఎంత మేర సమీకరించాల్సి ఉందని మంత్రి అధికారులను ప్రశ్నించారు. ప్రస్తుతం రాజధానిలో కొనసాగుతున్న రోడ్లు, ఇతర నిర్మాణాలకు అవసరమైన భూముల్లో ఇంకా ఎంత మేర ల్యాండ్ పూలింగ్ చేయాల్సి ఉందనే అంశంపై కూడా ఆరా తీశారు మంత్రి నారాయణ…

ఇక, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి నారాయణ.. భూసమీకరణలో రైతులతో నేరుగా మాట్లాడాలని సూచించారు. రైతులు లేవనెత్తుతున్న సందేహాలను నివృత్తి చేసి, ల్యాండ్ పూలింగ్‌కు వారు సహకరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించి రైతులతో నేరుగా మాట్లాడాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. రైతులు లేవనెత్తుతున్న సందేహాలను, అభ్యంతరాలను తెలుసుకుని వాటిని నివృత్తి చేయాలని సూచించారు. రైతులకు పూర్తి వివరాలు వివరించి, ల్యాండ్ పూలింగ్ ప్రక్రియకు వారు సహకరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. రాజధాని అభివృద్ధి పనులకు అవసరమైన భూమి సమీకరణపై క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేయాలని, రైతులతో సమన్వయంతో ముందుకు సాగాలని మంత్రి నారాయణ అధికారులకు సూచించారు..