Amaravati Farmers: రాజధాని అమరావతి ప్రాంత రైతులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం ముగిసింది.. ప్రతి మూడు నెలలకు ఒకసారి రైతులతో సమావేశం అవుతానని చెప్పారు చంద్రబాబు.. త్రిసభ్య కమిటీ ప్రతినెల రైతులతో సమావేశమై సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు.. ఇక, రైతుల సమస్యలను ఒక్కొక్కటిగా విన్న చంద్రబాబు… రైతుల ప్రతి సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు..
Read Also: Venkaiah Naidu: తెలుగులో తిట్టినా అద్భుతంగా ఉంటుంది.. అమ్మ భాషను మర్చిపోయిన వాడు మనిషే కాదు..!
ఇక, ఈ సందర్భంగా అమరావతి రైతులు మాట్లాడుతూ.. కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా కొన్ని సమస్యలు వచ్చాయి.. కొంత మంది రైతుల్లో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే.. ఈ రోజు ముఖ్యమంత్రితో సమావేశం తర్వాత అందరి రైతులు ఏకాభిప్రాయంతో ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నాం అని ప్రకటించారు.. చంద్రబాబును చూసే భూములు ఇచ్చాం.. చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత ఆ సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మకం కలిగింది అన్నారు.. రెండవ దశ భూ సమీకరణకు.. మేము కూడా మద్దతు తెలుపుతున్నాం అని వెల్లడించారు.. కొంతమంది ఇక్కడ భూముల అభివృద్ధి చేయకుండా మళ్లీ భూ సమీకరణ ఏంటని మాట్లాడుతున్నారు… ఇక్కడ అభివృద్ధి చేస్తూనే… అక్కడ కూడా అభివృద్ధి విస్తరణ జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని తెలిపారు.. సీఎం చంద్రబాబుతో సమావేశం తర్వాత రైతులందరూ సంతృప్తిగా ఉన్నారని ప్రకటించారు అమరావతి రైతులు..
ఇక, నెల రోజుల లోపు గ్రామ కంఠాల సమస్యపై సర్వే పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది.. రైతులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోనున్నారు.. దీని కోసం కలెక్టర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం.. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత సమస్య పరిష్కరిస్తామని ప్రభుత్వం చెబుతోంది.. సచివాలయంలో జరిగిన ఈ సమావేశానికి 29 గ్రామాల రైతులు హాజరయ్యారు.. ప్లాట్ల కేటాయింపు, జరీబు భూములు, అసైన్డ్ భూములపై భేటీలో చర్చించారు.. మొత్తంగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇవ్వడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..
