Amaravati Capital Works: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులను పునఃప్రారంభించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అమరావతిలోని లింగాయపాలెం దగ్గర సీఆర్డీఏ బిల్డింగ్ మిగిలిన పనులను పునఃప్రారంభించారు సీఎం చంద్రబాబు.. దీంతో.. రాజధాని నిర్మాణ పనుల పునః ప్రారంభానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టినట్టు అయ్యింది.. 160 కోట్ల రూపాయలతో జరపాల్సిన సీఆర్డీఏ కార్యాలయ ఇంటీరియర్ పనులను ఈ రోజు ప్రారంభించారు సీఎం చంద్రబాబు..
Read Also: TB Disease: ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే టిబి కావొచ్చు.. జాగ్రత్త సుమీ
ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ.. 2015 జనవరి 1న నోటిఫికేషన్ ఇచ్చినపుడు ఒక్క నెల రోజుల్లో 34,305 ఎకరాలు ఇచ్చారు.. గత ప్రభుత్వం రైతు సోదరులను ఇబ్బంది పెట్టిందన్నారు.. టెండర్లు అన్నీ సమయానికి పూర్తవుతాయి.. ప్రపంచ టాప్ 5 సిటీలలో ఒకటిగా అమరావతిని చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు మాట ఇచ్చారని తెలిపారు మంత్రి పొంగూరు నారాయణ.. మరోవైపు ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో గత ప్రభుత్వంలో అడవి జంతువులను, చిట్టడవిని పెంచారు.. అమరావతి రాజధానిగా ఉంటుందని సీఎం చంద్రబాబు నిర్ణయించారు అని తెలిపారు.. గత ప్రభుత్వం లో పోలీసు పరిపాలన సాగించారు.. అసైన్డ్ కౌలు వేయడం లేదని చాలామంది రైతులు అడిగితే రెండు విడతలుగా కౌలు వేశామని వెల్లడించారు ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్..