Site icon NTV Telugu

Amaravati Capital Construction: రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టం..

High Court Raft Foundation

High Court Raft Foundation

Amaravati Capital Construction: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక మైలురాయి ఆవిష్కృతమైంది. రాజధానిలో ఐకానిక్‌ భవనంగా నిర్మించనున్న హైకోర్టు భవనానికి సంబంధించిన రాఫ్ట్‌ ఫౌండేషన్ (Raft Foundation) పనులను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు అధికారికంగా ప్రారంభించారు. మంత్రి నారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఇంజినీర్లతో కలిసి రాఫ్ట్‌ ఫౌండేషన్‌ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Read Also: Viral Video: బైకులో కనపడకుండా అంత డబ్బు ఎలా దాచవయ్యా.. ఇంత ట్యాలెంట్ గా ఉన్నావేంట్రా..!

అమరావతిలో హైకోర్టు భవనాన్ని B+G+7 (బేస్‌మెంట్ + గ్రౌండ్ + 7 అంతస్తులు) మోడల్‌లో అత్యాధునిక, ఆకర్షణీయ, ఐకానిక్‌ డిజైన్‌తో నిర్మించనున్నారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థ Norman Foster and Partners రూపొందించిన డిజైన్‌ ఆధారంగా ఈ నిర్మాణం కొనసాగనుంది. మొత్తం 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, 52 కోర్టు హాల్స్‌తో కూడిన ఈ హైకోర్టు భవనం, రాష్ట్ర న్యాయవ్యవస్థకు కొత్త గుర్తింపుగా నిలవనుంది. అంతస్తుల వారీగా కోర్టులను ఏర్పాటు చేయనున్నారు..

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. 2, 4, 6వ అంతస్తుల్లో కోర్టు హాళ్లు.. 8వ అంతస్తులో ప్రధాన న్యాయమూర్తి కోర్టు ఉంటుందన్నారు.. భవన నిర్మాణంలో మొత్తం 45,000 టన్నుల స్టీల్ వినియోగిస్తున్నారని తెలిపారు.. మొత్తం 52 కోర్టు హాల్స్‌తో నిర్మాణం జరగనుంది అన్నారు.. ఇక, అమరావతి హైకోర్టు నిర్మాణాన్ని 2027 చివరికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పండుగల అనంతరం కూడా నిర్మాణ పనులు వేగం తగ్గకుండా కొనసాగుతాయని మంత్రి స్పష్టం చేశారు.

మరోవైపు, అమరావతి నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.. అమరావతి నిర్మాణ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. రాజధానిలో మొత్తం 7 భవనాలను ఐకానిక్‌ భవనాలుగా తీర్చిదిద్దుతున్నాం. Norman Foster and Partners ఇచ్చిన ప్రపంచస్థాయి డిజైన్‌తో ఈరోజు హైకోర్టు పనులు ప్రారంభించాం. ఇది ఏపీ న్యాయవ్యవస్థకు భవిష్యత్తు ల్యాండ్‌మార్క్‌.గా అభివర్ణించారు. హైకోర్టు భవనం 21 లక్షల చ.అ. విస్తీర్ణంలో 52 కోర్టు హాల్స్‌తో నిర్మించబడుతోంది. 2, 4, 6వ అంతస్తుల్లో కోర్టు హాళ్లు, 8వ అంతస్తులో ప్రధాన న్యాయమూర్తి కోర్టు ఉంటుంది అన్నారు.. భవన నిర్మాణానికి మొత్తం 45,000 టన్నుల స్టీల్‌ వినియోగిస్తున్నాం. 2027 చివరికి నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.. గత ప్రభుత్వం చేసిన అవకతవకల కారణంగా అమరావతి పనులు ఆలస్యం అయ్యాయి. ఇకపై అలాంటి పరిస్థితి రాకుండా పారదర్శకంగా, వేగంగా పనులు కొనసాగుతాయని స్పష్టం చేశారు మంత్రి నారాయణ..

Exit mobile version