Site icon NTV Telugu

Urea Shortage: యూరియా కొరత.. ఆంక్షలు పెట్టిన సర్కార్‌.. అలా చేస్తే కేసులే..!

Urea Shortage

Urea Shortage

Urea Shortage: యూరియా కొరత ఇప్పుడు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.. తెలుగు రాష్ట్రాల్లో అయితే మరి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి.. సంచి యూరియా కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచిచూడాల్సిన పరిస్థితి ఓవైపు.. అసలు.. యూరియా ఎక్కడా దొరకడం లేదన్న ఆందోళన నెలకొంది.. అయితే, యూరియా కొనుగోళ్లపై ఆంక్షలు పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. యూరియాను తక్షణ పంట అవసరాలకు మాత్రమే కొనుగోలు చేయాలి.. వ్యవసాయేతర పరిశ్రమల అవసరాలకు యూరియా వినియోగిస్తే కేసులు నమోదు చేయాలంటూ ఆదేశాలిచ్చారు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. రాష్ట్రంలో ప్రస్తుత యూరియా లభ్యత క్షేత్రస్థాయి పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అచ్చెంనాయుడు.. ఈ సమావేశంలో సీఎస్, డీజీపీ, సీఎంవో అదనపు సెక్రటరీ, డీజీపీ విజిలెన్స్ , డీజీపీ ఇంటిలిజెన్స్, అన్ని జిల్లాల కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా సహకార అధికారులు పాల్గొన్నారు..

Read Also: Supari Gang : మళ్లీ సూర్యాపేటలో సుపారీ మర్డర్ యత్నం

ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్ లో ఇప్పటివరకు యూరియాను రాష్ట్ర అవసరం కన్నా ఎక్కువ మొత్తంలో కేంద్రం సరఫరా చేస్తోంది.. క్షేత్ర స్థాయిలో అంతర్గత యాజమాన్యం సరిగా లేకపోవడం వల్ల యూరియా పంపిణీలో చాలా చోట్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు.. ఈ విషయం మీడియా దృష్టిలో పడి , వారి పత్రికా కథనాల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్నారు.. పంపిణీ వ్యవస్థలో ఏర్పడిన సమస్యను గుర్తించి సరిదిద్దుకోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.. యూరియా సరఫరా, లభ్యత విషయంలో రైతులకు ఎటువంటి తప్పుడు సందేశం అందకుండా చూడాలి.. రైతులు ముందస్తు అవసరాలకు, రాబోయే రబీసీజన్ కు కూడా సరిపడే యూరియా ను ఇప్పటినుండే ముందస్తు కొనుగోళ్లు జరపొద్దని సూచించారు.. మార్క్ ఫెడ్ కు ,ప్రైవేట్ వ్యాపారులకు ప్రస్తుతం ఉన్న యూరియా పంపిణీ నిష్పతి 50:50 నుండి 70:30 ఉండేలా చూడాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. యూరియా వినియోగాన్ని వ్యవసాయేతర పరిశ్రమల అవసరాలకు దారి మళ్లకుండా గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలి.. తక్షణమే జిల్లాల పరిధిలో పోలీస్ ,రెవెన్యూ ,పరిశ్రమలు తదితర శాఖలతో సంయుక్త విభాగాల పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి అచ్చెన్నాయుడు..

Read Also: CM Chandrababu: రేపు టీడీపీ కీలక సమావేశం.. తాజా పరిణామాలపై చంద్రబాబు ఏం చేస్తారు..?

ఇక, వ్యవసాయ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ.. చాలా ప్రాంతాలలో రైతులు రాబోవు రోజులలో యూరియా సరఫరా లో ఇబ్బందులు ఉంటాయనే తప్పుడు సందేశం ప్రచారంలో ఉండటం ద్వారా ,అవసరం కన్నా ఎక్కువ మొత్తములో ముందుగా కొనుగోలు చేసి ,నిల్వ చేస్తున్నారు.. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కు 6.22 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కేంద్రం కేటాయించింది.. రబీ సీజన్ కు 9.38 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కేంద్రం కేటాయించింది.. రైతులు ఎటువంటి అభత్రతకు, ఆందోళనకు గురికావొద్దు.. ఎక్కువ మొత్తంలో ఎరువులను ముందుగానే కొనుగోలు చేయాల్సిన అవసరం లేదన్నారు.. రైతులు ఎరువులను కొనుగోలు చేసినపుడు ఈ పోస్ మెషిన్ ద్వారా ఈ కేవైసీ విషయంలో రైతులే తప్పనిసరిగా వేలి ముద్రలు వేయాలనే నిబంధనను, రాష్ట్ర ప్రభుత్వముల కోరిక మేరకు 2018 నుండి తొలగించడం జరిగింది. వీటిని అవకాశంగా చేసుకుని కొంతమంది ఈ అవకాశం ను దుర్వినియోగం చేస్తున్నారు.. కేంద్రం జరుపుతున్న సమీక్షలలో ఎరువులను వ్యవసాయేతర పరిశ్రమల అవసరాలకు వాడితే ,క్లాస్ 25 ప్రకారం చర్యలు తీసుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చొరవ ,శ్రద్ధ చూపటం లేదంటోంది.. జిల్లా కలెక్టర్లు టీమ్ లను ఏర్పరిచి ,ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటూ కేసులు నమోదు చేయాలని సూచించారు వ్యవసాయ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్..

Exit mobile version