పార్వతీపురం మన్యం జిల్లా తోటపల్లి కుడి కాలువ నుంచి సాగు నీరును గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటుగా కురుపాం, పాలకొండ ఎమ్మెల్యేలు జగదీశ్వరి, జయకృష్ణ పాల్గొన్నారు. కురుపాం, పాలకొండ నియోజకవర్గాలతో పాటుగా మరో ఐదు నియోజకవర్గాల రైతులకు 1, 31, 221 ఎకరాలకు సాగునీరు అందనుంది.. రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు అని ఆమె పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో రైతులు అందరూ చాలా ఇబ్బంది పడ్డారు.. మళ్ళీ అధికారులు అందరికీ సమయానికి పంట పొలాలకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అని మంత్రి సంధ్యారాణి తెలిపారు.
Read Also: High Court: కేసీఆర్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్..
ఇక, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు త్రాగునీటికి, సాగునీటికి కొరత ఉండకూడదని మా మంత్రులు అందరికీ ఆదేశించారు అని గుమ్మడి సంధ్యారాణి అన్నారు. త్వరలోనే జంజావతి, పూర్ణపాడు లాబెసు సమస్యలను అరికట్టడానికి నిధులు కేటాయిస్తాము.. అలాగే, మన్యం జిల్లాలో ఉన్న అన్ని ప్రాజెక్టులకు నిధులు కేటాయించి.. తొందరలోనే ఆ ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత మా నలుగురు శాశనసభ్యులది అని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఐటీడీఏలు ఏ విధంగా ఉండేవో మళ్ళీ అదే విధంగా తీర్చి దిద్దుతూ ఐటీడీఏ పని తీరును మెరుగుపరుస్తామని మంత్రి సంధ్యారాణి వెల్లడించారు.