Hot Air Balloon in Araku Valley: అరకు పర్యాటకులకు గుడ్‌న్యూస్‌..

  • నేటి నుండి అరకులోయలో ఎగరనున్న బెలూన్లు..
  • పర్యాటకులకు అందుబాటులోకి రానున్న హాట్ ఎయిర్ బెలూన్..
  • పద్మాపురం గార్డెన్స్ లో హాట్ ఎయిర్ బెలూన్ షో..
  • ఉత్సాహంగా ఎదురుచూస్తున్న పర్యాటకలు.. స్థానికులు..
Hot Air Balloon

Hot Air Balloon

Hot Air Balloon in Araku Valley: అరకు పర్యాటకులకు గుడ్‌న్యూస్‌.. ఆంధ్రా ఊటీ అరకు అందాలను ఆకాశంలో నుంచి చూస్తే ఎలా వుంటుంది..!?. ఎప్పటి నుంచో ఈ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న పర్యాటకులకు ఇప్పుడు గుడ్ న్యూస్. ఇవాళ్టి నుంచి అరకు వ్యాలీలో హాట్ ఎయిర్ బెలూన్ అందుబాటులోకి వచ్చింది. అరకు హిల్స్ & వ్యాలీ సోయగాలను, మంచు తెరలను వందల అడుగుల ఎత్తు నుంచి చూసే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే సక్సెస్ఫుల్గా ట్రైల్ రన్ నిర్వహించిన నిర్వాహకులు… ఇవాళ్టి నుంచి రెగ్యులర్ గా అందుబాటులోకి తీసుకుని రానున్నారు. పద్మాపురం గార్డెన్స్ లో హాట్ ఎయిర్ బెలూన్ షో ప్రారంభం అవుతుంది.

Read Also: Rebal Star : ‘స్పిరిట్’ లో ప్రభాస్ క్యారక్టర్ ఏంటో చెప్పేసిన సందీప్ రెడ్డి వంగా

అయితే, గతంలో అరకు ప్రమోషన్ కోసం హాట్ ఎయిర్ బెలూన్ షో నిర్వహించిన అది ప్రొఫెషనల్ కోసమే జరిగింది. ఇప్పుడు హాట్ ఎయిర్ బెలూన్ అందుబాటులోకి రాగా అద్వంచర్ థ్రిల్ ఎంజాయ్ చేసేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు పర్యాటకలు. కాగా, అరకులోయ ప్రకృతి సౌందర్యానికి పేరుగాంచింది. శీతాకాలంలో వలిసపూలు పూసి కొండలన్నీ పసుపు వర్ణంతో మరింత అందంగా మారిపోతాయి.. అరకు చేరే మార్గంలో ఇరువైపులా దట్టమైన ఆడవులు ఉండే ఘాట్ రోడ్, ఆసక్తికరంగా ఆహ్లాదకరంగా ఉంటుంది… ఇప్పుడు అరకు అందాలను ఆకాశంలో నుంచి కూడా వీక్షించే అవకాశం అందుబాటులోకి వచ్చేస్తోంది. ఇది అరకుకు మరింత మంది పర్యాటకులను రప్పించేలా చేస్తుందని అంచనా వేస్తున్నారు..