Site icon NTV Telugu

Godavari Floods: విలీన మండలాలకు మరోసారి గోదావరి వరద భయం

Floods

Floods

Godavari Floods: అల్లూరి సీతారామరాజు జిల్లా విలీన మండలాలకు మరోసారి గోదావరి వరద భయం పట్టుకుంది. గడచిన రెండు నెలల్లో ఐదవసారి వరద తాకిడికి గురవుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శభరి, గోదావరి నదులకు వరద ప్రవాహం ఉధృతమైంది.. కూనవరం వద్ద 42 పాయింట్ 0,2 అడుగులతో రెండవ ప్రమాద హెచ్చరికకి చేరువలో గోదావరి వరద ప్రవాహం కొనసాగుతుంది.. కూనవరం మండలం కొండరాజుపేట కాజ్ వే పైకి చేరింది వరద నీరు చేరింది. వీఆర్ పురం మండలంలో చింతరేవుపల్లి, తుష్టివారి గూడెం అడవి వెంకన్న గూడెంలో రహదారులపైకి వరద నీరు చేరింది.. చింతూరు మండలం చూటూరు – ముకునూరు మధ్య రోడ్డుపైకి చేరిన వరద నీరు చేరడంతో.. పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. ఎటపాక మండలంలో నెల్లిపాక వీరాయిగూడెం రహదారిపైకి వరద నీరు చేరింది. వరద నీటిలోనే గిరిజనుల ప్రయాణాలు కొనసాగుతున్నాయి.. నాలుగు మండలాల వ్యాప్తంగా పలు గిరిజన గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.. ఎటపాక మండలంలో పలు చోట్ల మిర్చిపంట నీట మునిగింది. మరోవైపు, ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలతో గోదావరిలో మరోసారి వరద ఉధృతి కొనసాగుతోంది..

Read Also: Road Collapse: సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు.. వికారాబాద్కి రాకపోకలు బంద్

Exit mobile version