Araku Valley: సింగిల్ డిజిట్లోకి ఉష్ణోగ్రతలు.. అరకు అందాలకు చలికాలం తోడు.. పర్యాటకుల సందడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Araku Valley: అల్లూరి జిల్లా ఏజెన్సీలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. చలిగాలుల ప్రభావంతో ఏజెన్సీ ప్రాంతం గజగజ వణికిపోతోంది. ఈ ఏడాది తొలిసారిగా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. అరకులో కనిష్ఠంగా 9 డిగ్రీలు, పాడేరులో 12 డిగ్రీలు, మినమలూరులో 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఏజెన్సీలోని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. ముఖ్యంగా మాడగడ సన్‌రైజ్ పాయింట్ పర్యాటకులతో సందడిగా మారింది. తెల్లవారుజామునే పెద్ద సంఖ్యలో పర్యాటకులు మాడగడ కొండపైకి చేరుకుని సూర్యోదయాన్ని వీక్షిస్తున్నారు.
కొండ ప్రాంతాల్లో కురుస్తున్న మంచు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మంచు అందాలను తమ కెమెరాల్లో, సెల్ఫీల రూపంలో బంధిస్తూ సందడి చేస్తున్నారు. ప్రకృతి అందాల మధ్య సన్‌రైజ్‌ను ఆస్వాదిస్తూ ఆనందంగా గడుపుతున్నారు. అంతేకాకుండా స్థానిక గిరిజనులతో కలిసి సంప్రదాయ దింసా నృత్యాలు చేస్తూ ఆడిపాడుతున్నారు. ఒకవైపు చలి తీవ్రత పెరుగుతున్నప్పటికీ.. మరోవైపు మంచు అందాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, గిరిజన సంస్కృతి పర్యాటకులను ఏజెన్సీ వైపు ఆకర్షిస్తున్నాయి. దీంతో మాడగడ సన్‌రైజ్ పాయింట్ పర్యాటకుల సందడితో కళకళలాడుతోంది.
Also Read
- Alluri District Blast: మైనింగ్ ప్రాంతంలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి
- Marigold Farmers: దసరా వేళ బంతిపూలకు ధరలేవీ? రైతులకు తీవ్ర నిరాశ!
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్
తాజావార్తలు
-
Women’s Reservation Bill History: మహిళా రిజర్వేషన్ చట్టం చరిత్ర.. 1996 నుంచి 2023 వరకు, 33 శాతం కోటా ఎలా సాధ్యమైంది?
-
Araku Valley: సింగిల్ డిజిట్లోకి ఉష్ణోగ్రతలు.. అరకు అందాలకు చలికాలం తోడు.. పర్యాటకుల సందడి..
-
Rohit-Hardik November 27: ఒకే తేదీ.. మూడేళ్లలో ఎంత మార్పు!! హార్దిక్ ముంబైలోకి వచ్చిన రోజే రోహిత్‌కు మళ్లీ కెప్టెన్సీ..
-
Tirumala Vaikunta Dwara Darshan Tickets: వెంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల అప్పుడే..!
-
Ruturaj Gaikwad: రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 43 పరుగులు, 7 సిక్సర్లతో వరల్డ్ రికార్డు
ట్రెండింగ్
-
165Hz డిస్ప్లే, HyperOS 4తో Redmi TV A55 2027.. ధర, ఫీచర్లు ఇవే!
-
IND vs NZ Test: ఐదు వికెట్లతో ఆకాష్ దీప్ అదుర్స్.. 356 పరుగులకు కివీస్ ఆలౌట్..!
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్‌తో రాబోతున్న Nissan Terrano SUV..!