అల్లూరి ఏజెన్సీలో నిద్రిస్తున్న వ్యక్తిపై ఓ ఎలుగుబంటి దాడి చేసింది. ఎలుగుబంటి దాడిలో జన్ని అప్పారావు అనే గిరిజనుడు తీవ్రంగా గాయాలు పాలయ్యాడు. ఎలుగుబంటి దాడిలో గాయపడిన అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి పాడేరులో చికిత్స జరుగుతోంది. శనివారం అర్ధరాత్రి చేనుకు కాపలాగా పడుకున్న సమయంలో ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనతో గ్రామస్థులు ఆందళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Virat Kohli History: సచిన్ మరో ప్రపంచ రికార్డు బద్దలు.. ఇక ‘కింగ్’ కోహ్లీని కొట్టేవాడే లేడు!
అరకులోయ మండలం ఇరగాయి పంచాయితీ ఉరుములు గ్రామ సమీప కొండపై ఉన్న తన పంట చేనుకు జన్ని అప్పారావు కాపలాగా పడుకున్నాడు. శనివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో ఎలుగుబంటి ఒక్కసారిగా అతడిపై దాడి చేసింది. తల భాగం, చేతులపై బలంగా చీరడంతో.. గట్టిగా అరుపులు, కేకలు వేస్తూ అప్పారావు కొండ కిందకు పరుగులు తీశాడు. అప్పారావు అరుపులు విన్న స్థానికులు.. వెంటనే 108కి కాల్ చేశారు. వెంటనే స్పందించిన అంబులెన్స్ సిబ్బంది పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అప్పారావుకు చికిత్స జరుగుతోంది.
