Site icon NTV Telugu

AP CMO: అధికారులకు శాఖల కేటాయింపు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి కార్యాలయం (సీఎంవో)లో అధికారులకు శాఖలు కేటాయించారు.. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు స్పెషల్ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి… ఇక, సీఎంవోలో అధికారులకు కేటాయించిన శాఖల విషయానికి వస్తే.. స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డికి జీఏడీ, హోం, రెవెన్యూ, అటవీ, పర్యావరణ, వైద్య ఆరోగ్య, శాసనసభ వ్యవహారాలు, పరిశ్రమ, పెట్టుబడులు, మౌలిక వసతులు, కేంద్ర ప్రభుత్వ అంశాలు, సీఎంవో ఎస్టాబ్లిష్ మెంట్ అండ్ రెసిడ్యువల్ – సబ్జెక్టులు కేటాయించగా.. సీఎం కార్యదర్శి సాల్మన్ రాజ్‌కు పౌరసరఫరాలు, విద్యా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్, అన్ని సంక్షేమ శాఖలు కేటాయించారు.. ఇక, సీఎం కార్యదర్శి ధనుంజయ్ రెడ్డికి ఆర్థిక, ప్రణాళిక, ఇరిగేషన్, వ్యవసాయ, అనుబంధ రంగాలు, మున్సిపల్ పరిపాలన, ఇంధన, పర్యాటక, యువజన సర్వీసులు, మార్కెటింగ్ అండ్ సహకార శాఖలు కేటాయించారు.. సీఎం అడిషనల్ సెక్రెటరీ ముత్యాలరాజుకు ప్రజా ప్రతినిధుల వినతులు, రెవెన్యూ (ల్యాండ్, రిజిస్ట్రేషన్ – అండ్ స్టాంప్స్), హౌసింగ్, రవాణా, రోడ్లు, భవనాలు, కార్మిక, స్కిల్ డెవలప్ మెంట్ శాఖలు కేటాయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Read Also: Telangana: దేశంలోనే నంబర్ వన్… హోరెత్తిన #TriumphantTelangana హ్యాష్ ట్యాగ్..

Exit mobile version