ఇప్పటికీ ఏపీలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. గత పది రోజులుగా ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ నేతల మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఏలూరు స్మార్ట్ సిటీ చైర్మన్ గా బొద్దాని అఖిల ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.
చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్ళిపోయాడని, గద్దె దిగిపోతూ దిగిపోతూ ప్రజలను కష్టాల్లోకి నెట్టేసాడంటూ ఆరోపణలు గుప్పించారు. అంతేకాకుండా ప్రభుత్వం పై కావాలని విమర్శలు చేస్తున్నారని, చంద్రబాబు అండ్ కో తొత్తులు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని.. టీడీపీ ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.