ఇవాళ ఉమ్మడి గుంటూరు జిల్లా లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో కౌలు రైతు భరోసా సభలో పాల్గొననున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. అప్పుల బాధతో మరణించిన 286 మంది కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయల చొప్పన ఆర్థిక సాయం అందించనున్నారు పవన్ కళ్యాణ్. తన పర్యటనలో భాగంగా ఏటుకూరు ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించనున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సభ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు జనసేన నాయకులు. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే…ప్రభుత్వం బాధితుల కుటుంబానికి పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించలేదని విమర్శించారు.
Read Also: Cold in Telangana: ఇదేక్కడి చలిరా నాయనా.. ఒకరోజు తగ్గుతుంది.. మరొకరోజు చంపేస్తుంది
మాచర్లలో జరిగిన పరిణామాల నేపథ్యంలో గుంటూరు జిల్లాలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏపీలో రాజకీయాలు వేడెక్కిన వేళ పవన్ యాత్ర పై ఉత్కంఠ నెలకొంది. ఏపీలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు జనసేన పార్టీ ఎప్పటినుంచో ఆర్థికసాయం అందిస్తుంది. కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్ రూ.1 లక్ష చొప్పున చెక్కులు పంపిణీ చేస్తున్నారు. పవన్ రాక నేపథ్యంలో పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 200 మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్టు తెలుస్తోంది.
వీరి కుటుంబాలకు సత్తెనపల్లి వేదికగా జరిగే కార్యక్రమంలో ఆర్థికసాయం చెక్కులు అందించనున్నారు. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు సొంత నియోజకవర్గం అని తెలిసిందే. అయితే, ఈ నియోజకవర్గం నుంచి పలువురు నేతలు జనసేనలో చేరతారంటూ కథనాలు వస్తున్నాయి. రేపటి పవన్ సభలోనే ఈ చేరికలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. పవన్ వారాహి వాహనంపై ఏపీలో వైసీపీ నేతల విమర్శలు భారీస్థాయిలో వచ్చాయి. రాబోయే ఎన్నికలకు వారాహి వాహనం కీలకంగా మారనుంది. పవన్ ఎక్కడినించి పోటీచేసినా ఈసారి మాత్రం ఏపీ అసెంబ్లీలో ఎక్కువమంది జనసేన ఎమ్మెల్యేలు అడుగుపెట్టేందుకు పకడ్బందీ వ్యూహరచన చేస్తున్నారు. పొత్తుల సంగతి ఎలా వున్నా.. పార్టీ పటిష్టతపైనే పవన్ ఫోకస్ పెట్టారని చెప్పవచ్చు.
Read Also:Forbes magazine : ఈ ఏడాది అత్యుత్తమ భారతీయ చిత్రాలివే
