Site icon NTV Telugu

నేడు హిందూపురం బంద్‌కు అఖిల‌ప‌క్షం పిలుపు…

ఈరోజు హిందూపురంను జిల్లా కేంద్రం చేయాల‌ని కోరుతూ అఖిల‌ప‌క్షం బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు సంఘీభావంగా వాణిజ్య స‌ముదాయాలు స్వ‌చ్ఛందంగా మూసివేయాల‌ని నిర్ణ‌యించాయి. హిందూపురంను జిల్లా కేంద్రం చేయాలంటూ ఇప్ప‌టికే త‌న నిర్ణ‌యాన్ని ఎమ్మెల్యే బాల‌కృష్ణ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. జిల్లాల పున‌ర్వ‌వ‌స్థీక‌ర‌ణ చేయాల‌ని ఇప్ప‌టికే ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ది. అయితే, అనంత‌పురం జిల్లాను రెండుగా విభ‌జిస్తున్నారు. అనంత‌పురం, శ్రీ స‌త్య‌సాయి జిల్లాలుగా విభ‌జించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అయితే, దీనిని హిందూపురం వాసులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. జిల్లా కేంద్రంగా హిందూపురంను ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తూ ఈరోజు బంద్‌కు అఖిల‌ప‌క్షం పిలుపునిచ్చింది.

Read: ఎల‌న్ మ‌స్క్ కీల‌క వ్యాఖ్య‌లు: బైడెన్‌ను…

Exit mobile version