ఏపీలో ఈరోజు మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చెపట్టారు. ఈరోజు 8లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 5.30 లక్షల డోసులను ఇచ్చినట్టు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఏకె సింఘాల్ పేర్కొన్నారు. ఈరోజు ఇప్పటి వరకు 96 లక్షల మందికి ఫస్ట్ డోస్ ఇచ్చినట్టు సింఘాల్ పేర్కోన్నారు. అంతేకాదు, కేంద్రం నుంచి 9 లక్షల డోసులు వచ్చాయని, ఈరోజు ఇప్పటి వరకు 5.30 లక్షల మందికి వ్యాక్సిన్ అందించినట్టు సింఘాల్ తెలిపారు. రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో ఉన్న ఆక్సీజన్ కొరతను ఆగస్టునాటికి తీరుతుందని తెలిపారు. ఇక బ్లాక్ ఫంగస్ కు సంబందించి అంఫోటెరిసిన్ మందు కొరత ఉందని, ఏపీలో మాత్రమే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ మందు కొరత ఉన్నట్టు సింఘాల్ పేర్కొన్నారు.
ఆగస్టు నాటికి ఆక్సీజన్ కొరత ఉండదు…
