Air India: మరోసారి ఎయిర్ఇండియా విమానానికి తప్పిన భారీ ముప్పు..!
- విశాఖ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే పెను ప్రమాదం తప్పిన ఎయిర్ ఇండియా విమానం
- ఇంజిన్ రెక్కల్లో ఇరుక్కున్న పక్షి – ఫ్యాన్ బ్లేడ్లు దెబ్బతిన్నాయి
- పైలట్ల అప్రమత్తతతో సురక్షిత ల్యాండింగ్, ప్రయాణికులందరూ క్షేమం
- ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న ఎయిర్ ఇండియా, ఘటనపై విచారణ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India: విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్లు చాకచక్యంగా దాన్ని వెనక్కి మళ్లించారు. దీంతో విమానం సురక్షితంగా విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ అయింది. మధ్యాహ్నం 2:20 గంటలకు విశాఖ నుంచి హైదరాబాద్‌కు 103 మంది ప్రయాణికులతో ఈ విమానం బయలుదేరింది. గాల్లోకి లేచిన కొద్దిసేపటికే విమానం రెక్కల్లో ఒక పక్షి ఇరుక్కుంది. దీని కారణంగా విమానం ఇంజిన్ ఫ్యాన్ రెక్కలు దెబ్బతిన్నాయి.
Also Read
- AP Weather Alert: రానున్న 3 గంటలు జాగ్రత్త.. పిడుగులతో కూడిన వర్షాలు
- CM Chandrababu: తెలంగాణలో ఆస్తులన్నీ తెలుగు వారే అనుభవిస్తున్నారు.. ఎప్పుడూ రెగ్రేట్ ఫీల్ అవ్వలేదు!
- Kakinada Theft: కాకినాడలో విచిత్ర దొంగతనం.. క్షమాపణ లేఖ రాసి బంగారం తిరిగిచ్చిన యువకులు.. చివరకు!
- Mushrooms Sales: పుట్టగొడుగులకు భారీ డిమాండ్.. ఒక్క కట్ట రూ.500.. అయినా జోరుగా విక్రయాలు!
ఈ సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్లు వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం ఇచ్చి విమానాన్ని వెనక్కి తిప్పారు. సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత విమానంలోని ప్రయాణికులందరినీ దించివేశారు. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ఎయిర్ లైన్స్ సంస్థ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఘటనపై విమానయాన సంస్థ విచారణ చేపట్టింది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
Ilaiyaraaja : చుక్కలు చూపిస్తున్న ఇళయరాజా.. మరీ ఇంత అవసరమా..?
తాజావార్తలు
-
Number 1 All Rounder: ధోనీ, యువీ కాదు… ప్రపంచంలోనే నంబర్ 1 పవర్ హిట్టర్ ఇతడే..
-
DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
-
AP Weather Alert: రానున్న 3 గంటలు జాగ్రత్త.. పిడుగులతో కూడిన వర్షాలు
-
Ronaldo Wedding Rumors: నలుగురు పిల్లల తల్లితో రొనాల్డో పెళ్లి? వైరల్ అవుతున్న ఫుట్‌బాల్ దిగ్గజం వెడ్డింగ్ డేట్!
-
Gautam Gambhir: కోచింగ్ శైలిపై ఆటగాళ్ల అసంతృప్తి.. గంభీర్‌పై బీసీసీఐకి సీనియర్ల ఫిర్యాదు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!