Site icon NTV Telugu

పదో తరగతి పరీక్షలపై మరోసారి క్లారిటీ ఇచ్చిన ఆదిమూలపు సురేష్

Adimulapu Suresh

పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్ ను ఫణంగా పెట్టి రాజకీయం చెయ్యాలనుకుంటే అంతకంటే దుర్మార్గం ఉండదని..విద్యార్థుల ఆరోగ్యం, వారి భద్రత ప్రభుత్వానికి ముఖ్యమని పేర్కొన్నారు. పరిస్థితులు అనుకూలించిన తరువాత పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని క్లారిటీ ఇచ్చారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని.. పరీక్షలు ఎప్పుడు పెడతామనేది సరైన సమయంలో చెబుతామన్నారు. నారా లోకేష్ కు దొరికినట్టు అందరికీ సత్యం రామలింగరాజులు దొరకరని.. పరీక్షలపై లోకేష్ రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు మంత్రి ఆదిమూలపు సురేష్.

Exit mobile version