Site icon NTV Telugu

Actor Ali: వైసీపీ రాజ్యసభ ఎంపీగా అలీ.. రెండు వారాల్లో ప్రకటన?

టాలీవుడ్ సీనియర్ కమెడియన్ అలీ మంగళవారం మధ్యాహ్నం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అలీ మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ పిలుపు మేరకే తాను ఈరోజు ఆయనతో సమావేశం అయ్యానని తెలిపారు. పదవుల కోసం రాలేదని స్పష్టం చేశారు. అయితే త్వరలో పార్టీ ఆఫీసు నుంచి తనకు సంబంధించి ప్రకటన ఉంటుందని అలీ తెలిపారు.

రాజశేఖర్‌రెడ్డి కుటుంబంతో తనకు పాత పరిచయం ఉందని.. వైసీపీ పార్టీ కోసం తాను కష్టపడి పనిచేశానని అలీ వెల్లడించారు. 2019 ఎన్నికల్లో తనకు టిక్కెట్ ఆఫర్ చేసినా సమయం సరిపోదని భావించి తాను పోటీ చేయలేదని అలీ తెలిపారు. అయితే రెండు వారాల్లో తన గురించి ప్రకటన ఉంటుందని మాత్రమే జగన్ తనకు చెప్పారని పేర్కొన్నారు. కాగా అలీకి రాజ్యసభ సీటు ఇస్తారని కొన్నిరోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.

Exit mobile version