Site icon NTV Telugu

Tirumala Accident: తిరుమల ఘాట్ రోడ్‌లో యాక్సిడెంట్… ఐదుగురు భక్తులకు గాయాలు

Tirumala Ghat Accident

Tirumala Ghat Accident

Tirumala Ghat Road Accident: తిరుమల ఘాట్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు భక్తులకు గాయపడ్డారు. అయితే ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతుండగా ఘాట్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ఐదుగురు భక్తులు గాయపడ్డారు. మంగళవారం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. తిరుమల ఏడుకొండలపైకి వెళుతుండగా ఘాట్ రోడ్డుపై టెంపో వాహనం అదుపుతప్పి రెయిలింగ్ ను ఢీకొట్టింది. తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు టెంపో వాహనంలో తిరుమలకు వచ్చారు. ఘాట్ రోడ్డుపై వెళుతుండగా 13వ మలుపు వద్ద టెంపో అదుపుతప్పి రెయిలింగ్ ను ఢీకొట్టి ఆగింది. దీంతో వాహనంలోని ఐదుగురు భక్తులు గాయపడ్డారు. ప్రమాదం సమాచారం అందిన వెంటనే టీటీడీ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ముందుగా గాయపడిన క్షతగాత్రులను తిరుపతి రుయా హాస్పిటల్ కు తరలించారు. ఘాట్ రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోకుండా ప్రమాదానికి గురయిన టెంపోను అక్కడినుండి వెంటనే తరలించారు.

Read also:

టెంపో రెయిలింగ్ ను ఢీకొని ఆగడంతో పెనుప్రమాదం తప్పిందని.. టెంపో రెయిలింగ్‌ను దాటుకుని ముందుకు వెళ్లివుంటే లోయలో పడిపోయేదని ప్రత్యక్షసాక్షులు.. టెంపోలో ప్రయాణించిన ప్రయాణీకులు చెబుతున్నారు. రెయిలింగ్‌ను ఢీకొని ఆగిపోవడం మూలంగానే అందులోని భక్తులకు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా భక్తులు సురక్షితంగా బయటపడ్డారని వారంటున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగక పోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. తిరుమల కొండపైకి వెళ్లేదారిలో చిరుతల సంచారం కలకలం రేపుతుండటంతో.. టీటీడీ, అటవీ శాఖ అధికారులు ఆపరేషన్ చిరుత చేపట్టిన విషయం తెలిసిందే. తిరుమల కొండలపై గల అడవుల్లో బోన్లు ఏర్పాటుచేసి చిరుతలను పట్టుకుంటున్నారు అధికారులు. కేవలం మూడురోజుల వ్యవధిలోనే రెండు చిరుతలు అధికారులు ఏర్పాటుచేసిన బోనులో పడ్డాయి. ఇటు రోడ్డు ప్రమాదాలను నివారించడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న టీటీడీ అధికారులు అటు వన్యమృగాల మూలంగానూ ఎటువంటి ప్రమాదాలు, ప్రాణ నష్టం జరగకుండా ఉండటానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు.

Exit mobile version