Site icon NTV Telugu

Aarogyasri In AP: ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలకు సుస్తీ..

Arogya Sree

Arogya Sree

Aarogyasri In AP: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని స్పెషాలిటీ హాస్పిటల్స్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. నెట్‌వర్క్ హాస్పిటల్స్‌కు 2,500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నట్లు తెలిపారు. వారంలోగా సమస్య పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇక, ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓ దినేష్ కుమార్ కి ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు లేఖ రాశారు. ఇక, ఇప్పటికి మూడు సార్లు సమ్మె బాట పట్టిన నెట్‌వర్క్ హాస్పిటల్స్.. 200 కోట్ల రూపాయల బకాయిలు ఉండడంతో ఎంప్లాయిస్ హెల్త్ స్కీం గత కొంతకాలంగా ఆయా ఆస్పత్రులు ఆపేశాయి. అలాగే, ఈ బకాయిలపై ఏపీ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని అభ్యర్థన చేశారు.

Read Also: Cardiac Arrest: పీచే దేఖో పీచే.. మీమ్‌తో వైరల్ అయిన అహ్మద్ షా తమ్ముడికి గుండెపోటు..

మరోవైపు, తెలంగాణలోని దవాఖానల్లో నేటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (TANHA) సెప్టెంబర్ 16 అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ పథకం కింద సేవలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించపోవడంతో రూ.1400 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని చెప్పుకొచ్చారు. త్వరగా మొండి బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Exit mobile version