Loan App Harassment: లోన్ యాప్స్ వేధింపులతో బలి అవుతోన్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది.. అవసరానికి డబ్బు తీసుకున్నా.. తిరిగి కట్టలేక వేధింపులతో ప్రాణాలు తీసుకునేవారు కొందరైతే.. చెల్లించినా వేధింపులు తప్పక ఆత్మహత్యలకు పాల్పడుతోన్నవారు మరికొందరు.. తాజాగా, చిత్తూరు జిల్లాలో మరో యువకుడు లోన్ యాప్ వేధింపుల కారణంగా ప్రాణాలు తీసుకున్నాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా పెనుమూరు అంబేద్కర్ కాలనీ చెందిన యువకుడు జానకీరాం.. లోన్ యాప్‌లో 80వేలు రూపాయలు డబ్బులు తీసుకున్నాడు.. కొంత కాలం బాగానే చెల్లించినా.. ఆ తర్వాత చెల్లింపులు చేయడం ఆ యువకుడికి కష్టంగా మారింది.. అయితే, లోన్ యాప్ నిర్వాహకుల నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో.. ప్రాణం తీసుకున్నాడు.. అవరాలకు రూ.80 వేలు అప్పుగా తీసుకున్నాను.. తిరిగి కట్టలేక పోయాను.. వాళ్లు నన్ను వేధిస్తున్నారు.. ఈ బాధను భరించలేకపోతున్నా.. ఆత్మహత్య చేసుకుంటున్నా.. నన్ను క్షమించండి అంటూ సూసైడ్ నోట్ రాసుకొచ్చాడు జనకీరాం..
Read Also: Astrology : జనవరి 04, బుధవారం దినఫలాలు
ప్రియమైన అమ్మ, నాన్న, వదినలు నన్ను క్షమించాలి అంటూ లేఖ రాసుకొచ్చాడు జనకీరాం.. నా కోసం మీరు ఎంతో చేశారు.. కానీ, నేను ఏమీ చేయలేకపోయా.. నన్ను క్షమించండి.. అలవాట్ల కోసం, నా అవసరాల కోసం ఎన్నో తప్పులు చేశాను.. నా లైఫ్‌లో ఎన్నో కష్టాలు పడ్డాను.. నా అనుకున్నవాళ్లు నాకు ఎంతో అన్యాయం చేశారు.. ఆన్‌లైన్‌లో అప్పు చేశాను.. అది కూడా నా సొంత ఖర్చుల కోసమే.. కానీ, వాళ్లు వేధిస్తున్నారు.. బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు.. రూ.80 వేల ఆన్‌లైన్ అప్పును మేనేజ్ చేయడం నా వల్ల కావడంలేదు.. అందరి దగ్గర మాటలు పోయాయి.. అమ్మ నన్ను క్షమించు.. కేవలం ఈ అప్పు కోసమే చనిపోతున్నాను.. ఇంకా ఎవరికోసమో కాదు.. అలాంటి ఉద్దేశం ఏమీలేదు.. నా చావుకు ఎవరూ బాధ్యులు కాదు.. అంటూ సూసైడ్ నోట్‌లో రాసుకొచ్చాడు.