Site icon NTV Telugu

Women Protest: పల్నాడులో భూమి కోసం ఓ మహిళ వినూత్న నిరసన..

Palnadu

Palnadu

Women Protest: పల్నాడు జిల్లాలో ఓ మహిళ వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తుంది.. తన పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమిని కొంత మంది ఆక్రమించుకున్నారని అధికారులు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పొలంలో ఆమరణ దీక్షకు దిగింది. నిన్న ( శనివారం ) ఉదయం నుంచి ఆమరణ దీక్ష చేస్తున్న సుజాత అనే మహిళతో పాటు ఆమె ఇద్దరు పిల్లలను రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె నివాసం ఉంటున్న దొనకొండకు వెళ్లి పోవాలని ఆదేశిస్తూ.. తీసుకు వెళ్లి రైల్వేస్టేషన్లో పోలీసులు వదిలి పెట్టారు.

Read Also: Natwar Singh: మాజీ విదేశాంగ మంత్రి కన్నుమూత..

అయితే పట్టు వదలని ఆ మహిళ తిరిగి మళ్లీ పొలంలోనికే వచ్చి కూర్చుంది. రాత్రంతా తన ఇద్దరు పిల్లలతో కలిసి పొలంలోనే ఉంది. 2016 నుంచి తాను అనేక రకాలుగా పోరాటాలు చేస్తున్నానని తనకు ఉన్న ఒక్క ఎకరం పొలం కాపాడుకోవడానికి.. తనకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తానని మహిళ చెబుతుంది. ఈ సందర్భంగా ఓ సెల్పీ వీడియోను రిలీజ్ చేసింది. అందులో తన బాధను ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని సదరు మహిళ కోరారు.

Exit mobile version