Site icon NTV Telugu

Vijayawada Crime: నిద్రపోతున్న భర్త.. వేడినీళ్లు పోసిన భార్య

Vijayawada Crime

Vijayawada Crime

Vijayawada Crime: భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి చాలా కారణాలున్నాయి. తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, అదనపు కట్నం కోసం వేధించారని, ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని చెబుతూ ఉంటే అనేక కారణాలు ఉన్నాయి. గొడవల కారణంలో పరిస్థితులు రానురాను సంప్రదాయాలను కూడా మరిచిపోయేలా చేస్తున్నాయి. ఎక్కడా అనుబంధానికి, అనురాగాలకు తావు లేదు. తప్పుడు మార్గాల్లో వెళ్లాలనే ఆలోచనలు పెరుగుతున్నాయి. భారమైన జీవితాలు మనిషి యొక్క సహజ సహనాన్ని పరీక్షిస్తున్నాయి. రెప్పపాటులో తప్పులు చేస్తూ దాని పర్యవసానాల గురించి ఆలోచించలేకపోతున్నారు. అనేక విషయాల్లో పెరుగుతున్న ఒత్తిడిని తట్టుకోలేక ఎదుటి వారిపై ఆకోపాల్ని చూపిస్తూ పచ్చిని సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు. ఇలాంటి ఒత్తిడిలో మానవ సంబంధాలు చచ్చిపోతున్నాయి. ఎవరి ప్రాణం తమదే అన్నట్లు జీవిస్తున్నారు. కానీ ధైర్యమైన నిర్ణయం తీసుకోలేని వాళ్లకి ఇదంతా జరుగుతుంది, ఓపిక ఉన్నంత వరకు భరించి, చివరకు ఒకరోజు కోపంతో రగిలిపోతూ తప్పుడు నిర్ణయం తీసుకుంటారు. ఇది వారి జీవితాలను సమూలంగా మారుస్తుంది. ఈ మార్పు తర్వాత వారికి మరో జీవితం ఉంటుందా లేదా అనేది కూడా తెలియదు. ఇటీవల సమాజంలో భార్యాభర్తల మధ్య ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే విజయవాడలో చోటుచేసుకుంది. భర్తపై కోపంతో వేడి నీళ్లు పోసింది.

Read also: Jobs: యువతకు శుభవార్త.. ఈ రంగంలో 10 లక్షల మందికి పైగా ఉద్యోగాలు

విజయవాడ లో దుర్గారావు,భార్య శ్రావణి వన్ టౌన్ చిట్టి నగర్ లో నివాసం ఉంటున్నారు. అయితే సజావుగా సాగిన వీరి జీవితంలో కొద్ది రోజులుగా గొడవలు మొదలయ్యాయి. అయితే నిన్న భార్యభర్తల మధ్య గొడవ మళ్ళీ మొదలైంది. కోపంలో ఒకరినొకరు మాటల యుద్ధం జరిగింది. భార్యతో గొడవ అనంతరం భర్త నిద్ర పోయాడు. అయితే.. భర్తపై భార్య శ్రావణి కోపం పెంచుకుంది. తనతో గొడవ పడిన భర్త ప్రశాంతంగా పడుకోవడం సహించలేకపోయింది. స్టవ్ పై నీళ్లు పెట్టింది. నీటిని బాగా మరిగించింది. ఆ నీటిని తీసుకుని వచ్చి నిద్రిస్తున్న భర్తపై పోసింది. దీంతో భర్త ఒక్క అరుపుతో లేచి కూర్చున్నాడు. ఏమైంది ఎందుకు నాపై వేడి నీటిని పోసావువంటూ భార్యపై మండిపడ్డాడు. ఒళ్లంతా మంటగా ఉందంటూ విలవిల లాడాడు. దుర్గారావు బంధువులకు సమాచారం ఇచ్చాడు. ఇంటికి చేరుకున్న బంధువులు దుర్గారావును ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు దుర్గారావు భార్యపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు.
YSRCP: దొంగ ఓట్లపై చంద్రబాబు ఫిర్యాదు హాస్యాస్పదం.. పవన్‌ గురించి మాట్లాడడం సమయం వృథా..!

Exit mobile version