Site icon NTV Telugu

Anantapur: అనంతపురంలో దారుణం.. మైనర్ బాలిక హత్య.. ఎవరు చంపారంటే..!

Untitled 4

Untitled 4

Anantapur: తెలిసీ తెలియని వయసు తనది.. ప్రేమకి ఆకర్షణకి మధ్య తేడా తెలియని టీనేజ్.. తప్పును తప్పు అని చెప్తే ఒప్పుకోలేని కౌమార దశ.. చేస్తుంది తప్పు అని నెమ్మదిగా నచ్చ చెప్పాల్సిన బాధ్యత కుటుంభసభ్యులది. కానీ అలా చెయ్యలేదు. 18 సంవత్సరాలు నిండకుండానే పెళ్లి చెయ్యాలి అనుకున్నారు. వినలేదని కొట్టి ఉరివేసి ప్రాణాలు తీశారు. ఈ దారుణ ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. వివరాల లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా లోని గార్లదిన్నె మండలం లోని కోటంక గ్రామంలో ఓ మ్తెనర్ బాలికకు పెళ్లి చెయ్యాలి అనుకున్నారు. కాగా కుమార్తెకు పెళ్లి చేసే విషయంలో ఆ బాలికకు కుటుంబ సభ్యలకు మధ్య గొడవలు జరిగాయి. పెద్దలు చూసిన సంబంధం చేసుకోను అని.. తాను వేరే అబ్బాయి పేమించాను అంటూ.. తనకు నచ్చిన వాడిని చేసుకుంటాను అంటూ 17 ఏళ్ల మైనర్ బాలిక గొడవ పడింది. ఇలా గత కొంత కాలంగా ఇంట్లో తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం కూడా ఈ విషయం గురించి గొడవ జరిగింది.

Read also:Credit Card Offers : దీపావళి పండుగకు ఈ కార్డులపై ఆఫర్లే ఆఫర్లు.. త్వరపడండి

బాలిక ప్రేమను అంగీకరించడం ఇష్టం లేక.. కూతురికి నచ్చచెప్ప లేక కుమార్తె మాట వినడం లేదని ఆ బాలికను కొట్టి ,చున్నీతో ఊరి వేసి హత్య చేశారు తల్లి అంజినమ్మ, కుటుంబసభ్యులు. అనంతరం స్థానిక పోలీసు స్టేషన్ కి వెళ్లి లొంగిపోయారు. తామే బాలికను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. దీనితో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ కేసులో పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Exit mobile version