Vizag Theft Case: వీర వనిత.. కత్తితో పొడిచినా, నలుగురు దుండగుల్ని ప్రతిఘటించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Married Woman Fought With 4 Robbers In Vizag: ఆమె ఒక్కతే.. వాళ్లు నలుగురు. పైగా వారి చేతిలో కత్తులున్నాయి. అయినా సరే, ఆ మహిళ ఏమాత్రం భయపడకుండా, వారిని ప్రతిఘటించింది. తీవ్ర గాయాలపాలైనా, లెక్క చేయకుండా వీర వనితలా ఎదురించింది. చివరికి వారి నుంచి తప్పించుకొని, ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. పెందుర్తిలోని చీమలపల్లిలో ఉన్న చెరువుగట్టు ప్రాంతంలో ఆళ్ల అప్పారావు అనే కుటుంబం నివసిస్తోంది. ఆయన తన భార్య లలితకుమారి, ఇద్దరు కుమారులు (వినయ్‌కుమార్, అవినాష్‌కుమార్) కలిసి ఉంటున్నారు. ఆయన కుమార్లో ఒకరైన అవినాష్‌కు ఇటీవల లావణ్యతో వివాహం అయ్యింది. మంగళవారం రాత్రి ఎప్పట్లాగే అవినాష్ విధులకు వెళ్లారు. కుటుంబ సభ్యులంతా ఓ గదిలో ఉండగా.. మరొక గదిలో లావణ్య ఒక్కతే నిద్రిస్తోంది.
కట్ చేస్తే.. అదే రోజు అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో, నలుగురు దుండగులు దొంగతనం చేసేందుకు వచ్చారు. ఇంటి కిటికీ గ్రిల్‌ను తొలగించి.. లోపలికి ప్రవేశించారు. అప్పటివరకూ చప్పుడు కాకుండా, జాగ్రత్తగా లోనికి వెళ్లారు. అత్త, మామయ్య, బావ పడుకున్న గదికి బయట నుంచి గడియ పెట్టేశారు. లావణ్య గది తలుపుని బద్దలుకొట్టి.. లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేశారు. అయితే.. ఆ శబ్దానికి లావణ్య నిద్ర లేచింది. లావణ్య నిద్రలేచిన విషయం గమనించిన దుండగులు.. ఆమెని బందింఛేందుకు ప్రయత్నించారు. కానీ.. లావణ్య వారికి దొరక్కుండా తీవ్రంగా ప్రతిఘటించింది. గట్టిగా కేకలు వేసింది. ఈ క్రమంలో వాళ్లు ఆమెపై కత్తితో దాడి చేశారు. అయినా లెక్క చేయకుండా.. వారిని ఎదుర్కొని, గదిలో నుంచి బయటకు వచ్చి, గట్టిగా కేకలు వేసింది. అత్త, మామ, బావ పడుకున్న గదికి గడియ వేయడంతో.. వాళ్లు బయటకు రాలేకపోయారు. అయితే.. లావణ్య అరుపులకు స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఈలోపే ఆ దుండగులు పారిపోయారు.
Also Read
తీవ్ర గాయాలపాలైన లావణ్యను.. దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ఈ కేసులో పోలీసులు కొన్ని అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇతర కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న గదికి బయటి నుంచి గడియ వేయడం, లావణ్య ఉన్న గదిలోకే దుండగులు రావడం, ఆమెపై కత్తితో దాడులు చేయడంతో.. ఎవరైనా కుట్ర పన్ని ఈ దాడికి పాల్పడ్డారా? అనే కోణంలో విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..