A Man Commits Suicide Due To LoanApp Harassment In Vijayawada: లోన్‌యాప్ వేధింపులకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. తీసుకున్న డబ్బులు నిర్దేశించిన సమయంలో తిరిగి ఇవ్వకపోతే.. బాధితుల్ని తీవ్రంగా హింసిస్తున్నారు. బూతులు తిట్టడమే కాదు.. వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి మరీ వేధిస్తున్నారు. తమకు కొంచెం సమయం ఇవ్వమని రిక్వెస్ట్ చేసినా.. వాళ్లు కనికరించడం లేదు. దుర్మార్గుల్లాగా వ్యవహరిస్తున్నారు. మానసికంగా కుంగిపోయేలా చేస్తున్నారు. ఇలా కుంగిపోయిన బాధితుల్లో ఎంతోమంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇప్పుడు తాజాగా మరో వ్యక్తి ఈ లోన్‌యాప్ వేధింపులకు బలి అయ్యాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Jr NTR: తారకరత్న పోరాడుతున్నారు.. మీడియాతో జూ. ఎన్టీఆర్
విజయవాడలోని సూరయపలెంలో గ్రామానికి చెందిన తంగెళ్ళమూడి రాజేష్ అనే వ్యక్తి కొంతకాలం క్రితం లోన్‌యాప్‌లో రుణం తీసుకున్నాడు. అయితే.. ఆర్థిక సమస్యల కారణంగా అతడు సరైన సమయానికి డబ్బులు తిరిగి ఇవ్వలేకపోయాడు. ఇక అప్పటి నుంచి లోన్‌యాప్ నిర్వాహకులు రాజేష్‌ని వేధించడం మొదలుపెట్టారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేకపోతే ఫోటోలు మార్ఫింగ్ చేసి భార్యకి పెడదామని బెదిరించారు. తనకు కొంత సమయం ఇవ్వమని ఎంత వేడుకున్నా.. వాళ్లు వినలేదు. చివరికి నిర్వాహకులు అన్నంత పని చేశారు. రాజేష్ ఫోటోలను మార్ఫింగ్ చేసి.. అతని భార్య రత్నకు పంపించారు. ఆ ఫోటోలను వైరల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో తీవ్ర అవమానంగా భావించిన రాజేష్.. ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తన భార్యకు ఫోన్ చేసి బోరున విలపించాడు. భార్య ఇంటికి వచ్చేసరికి.. రాజేష్ ఉరివేసుకొని, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై రత్న పోలీసుల్ని ఆశ్రయించగా.. వాళ్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Volodymyr Zelenskyy: ట్విస్ట్ ఇచ్చిన జెలెన్‌స్కీ.. రష్యాకి ఊహించని దెబ్బ
రాజేష్ భార్య రత్న మాట్లాడుతూ.. తన భర్త లోన్ తీసుకున్న విషయం తనకు తెలియదని పేర్కొంది. తన మొబైల్ నంబర్ లోన్‌యాప్ నిర్వాహకులకు ఎలా తెలిసిందో తెలీదని తెలిపింది. లోన్‌యాప్ వాళ్లు తనకు పదేపదే కాల్స్ చేసి బెదిరించారని చెప్పింది. తన భర్త మార్ఫింగ్ ఫోటోలు పెట్టి మరీ బెదిరింపులకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ఫోటోలు చూసి తన భర్త తట్టుకోలేక.. తనకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఏడ్చాడని వాపోయింది. తన భర్త చనిపోయిన విషయం చెప్పినా.. లోన్‌యాప్ నిర్వాహకుల నుంచి కాల్స్ రావడం ఆగలేదని, ఇప్పటికీ కాల్స్ వస్తూనే ఉన్నాయని పేర్కొంది.