NTV Telugu Site icon

Husband Killed Wife: భార్య గొంతు కోసిన భర్త.. కథలో ఊహించని ట్విస్ట్ తెలిస్తే మైండ్ బ్లాకే!

Chittoor Extramarital Affai

Chittoor Extramarital Affai

A Chittoor Man Killed His Wife For Having Extramarital Affair: వివాహేతర సంబంధాలకు కాపురాలు కూలిపోవడమే కాదు, దారుణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అయిన వారినే చంపుకునే దాకా మనుషులు బరితెగించేస్తున్నారు. ప్రియురాళ్ల కోసం భార్యని, ప్రియుళ్ల కోసం భర్తల్ని హతమార్చడం వంటి ఘాతుకాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు తాజాగా అలాంటి దారుణమే ఒకటి వెలుగు చూసింది. పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కోపంతో.. భార్యని ఓ భర్త గొంతుకోసి చంపేశాడు. ఈ కథలో మరో ట్విస్ట్ ఏమిటంటే.. తొలుత ప్రియుడి కోసం ఆ భార్య తన భర్తనే కడతేర్చాలని ప్లాన్ చేసింది. కానీ.. అది వర్కౌట్ అవ్వలేదు. సినిమాల్లో లెవెల్‌లో త్రిల్లింగ్‌గా అనిపించే ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..

Chatthishgar : ఛీ.. ఛీ.. నువ్వు అస్సలు మనిషివేనా?

చిత్తూరు జిల్లాలోని చౌడేపల్లిలో నాగరాజు, రేఖ (26) అనే దంపతులు నివాసముంటున్నారు. మొదట్లో వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది కానీ, తిమ్మరాజు అనే వ్యక్తి రాకతో కథ మారింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన తిమ్మరాజుకు అనుకోకుండా రేఖతో పరిచయం అయ్యింది. కొన్ని రోజులకే అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. తొలుత ఎవ్వరికీ తెలియకుండా రేఖ, తిమ్మరాజు కలిసి తమ రాసలీలలు కొనసాగించారు. అయితే.. వీరి గుట్టు ఎంతోకాలం దాగి ఉండలేదు. ఒకరోజు వీళ్లిద్దరు నాగరాజుకి అడ్డంగా దొరికిపోయారు. అప్పుడు అతడు ఇద్దరినీ మందలించాడు. మరోసారి తన భార్యని కలవొద్దని తిమ్మరాజుకి వార్నింగ్ ఇచ్చాడు. అటు, తప్పు చేసిన తన భార్యని క్షమించి, ఆమెతో మునుపటిలాగే సంసార జీవితాన్ని కొనసాగించాడు. అయితే.. రేఖ మాత్రం తిమ్మరాజుని విడిచి ఉండలేకపోయింది. అతనితోనే జీవితాంతం ఉండాలని నిర్ణయించుకుంది.

GDP Growth: 2000 – 2020 మధ్య అత్యధిక జీడీపీ గ్రోత్ కలిగిన టాప్-10 దేశాలు

ఈ క్రమంలోనే అడ్డుగా ఉన్న తన భర్త నాగరాజుని అంతమొందించాలని, ప్రియుడితో కలిసి రేఖ ప్లాన్ చేసింది. కానీ, అది వర్కౌట్ అవ్వలేదు. ఫ్లాప్ అయ్యింది. దీంతో.. మరోసారి పక్కా ప్లాన్ వేయాలనుకున్న రేఖ, తిమ్మరాజు.. ఎప్పట్లాగే మళ్లీ తరచు కలుసుకోవడం మొదలుపెట్టారు. అయితే.. ఇటీవల వీళ్లిద్దరు మరోసారి నాగరాజు మళ్లీ దొరికారు. దాంతో కోపాద్రిక్తుడైన నాగరాజు.. తిమ్మరాజుని కలవొద్దని భార్యని మందలించాడు. ఆమెతో గొడవకు దిగాడు. రేఖ మాత్రం తిమ్మరాజుని విడిచి ఉండలేనంటూ తిరగబడింది. కోపాద్రిక్తుడైన భర్త.. కత్తి తీసుకొని భార్యపై దాడి చేశాడు. ఆమె గొంతు కోసి చంపేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Show comments