NTV Telugu Site icon

Chittoor: వీడిన పుంగనూరులో ఆరేళ్ల చిన్నారి హత్య కేసు మిస్టరీ..

Chittor

Chittor

చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆరేళ్ల చిన్నారి హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ కేసుపై జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మీడియా సమావేశం నిర్వహించారు చిన్నారి హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణం అని అన్నారు. పాప తండ్రి ఓ మహిళకు మూడున్నర లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు.. అప్పుడు తిరిగి చెల్లించాలంటూ ఆ మహిళను బెదిరించడం, తిట్టడం సివిల్ కోర్టులో కేసు వేస్తామని చెప్పాడు. దీంతో.. అతనిపై పగ పెంచుకుని ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా చిన్నారిని ఇంటికి తీసుకెళ్లి ఆహారం పెట్టి తరువాత కోపంతో చిన్నారి ముక్కును, నోటిని గట్టిగా మూసి హత్య చేశారని పోలీసులు తెలిపారు. హత్య తర్వాత చిన్నారిని బైక్ పై తీసుకెళ్లి సమ్మర్ స్టోరేజ్ లో పడేశారని అన్నారు. చిన్నారిని హత్య చేసిన రేష్మ, ఆమె తల్లి హసీనా, సహకరించిన మైనర్ బాలుడు అఖిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చిన్నారి మిస్ అయిన రోజునే హత్య చేసి సమ్మర్ స్టోరేజ్‌లో పడేశారు.. చిన్నారిపై ఎలాంటి గాయం లేదని పోలీసులు వెల్లడించారు.

Read Also: IND vs BAN: టీమిండియా ఓపెనర్‌గా సంజూ శాంసన్‌.. కెరీర్ ప్రారంభంలో సూపర్ ఇన్నింగ్స్!

ఈ ఘటనపై చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ.. చిన్నారి అదృశ్యం అయిందని తెలిసిన వెంటనే పోలీసులు సర్వహికంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పక్కా ఆధారాలతో చిన్నారిని హత్య చేసిన నిందితులను పట్టుకున్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలో.. మీడియాపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని ఛానల్స్ చిన్నారి మృతి పై తప్పుడు ప్రచారం చేశాయి.. కనీసం నిబంధనలు పాటించకుండా చిన్నారి పేరును ఫోటోలను అసత్య ప్రచారాలను ప్రసారం చేశారు.. దయచేసి మీడియా ఇలాంటి విషయాల్లో బాధ్యతగా ఉండాలని కోరుకుంటున్నానని కలెక్టర్ తెలిపారు.

Read Also: Mallu Bhatti Vikramarka: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చారిత్రాత్మకమైంది..