NTV Telugu Site icon

త‌గ్గిన కోవిడ్ కేసులు.. 11 శాతానికి ప‌డిపోయిన పాజివిటీ..!

Delhi CM

క‌రోనా సెకండ్‌వేవ్ స‌మ‌యంలో.. దేశ రాజ‌ధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూశాయి.. మృతుల సంఖ్య కూడా పెరుగుతూ వ‌చ్చింది… దీంతో.. అప్ర‌మ‌త్త‌మైన ఆ రాష్ట్ర సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ లాక్‌డౌన్‌ను ప్ర‌క‌టించారు.. ఆ త‌ర్వాత మ‌ళ్లీ లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ వ‌చ్చారు.. అయితే, లాక్‌డౌన్ ఫ‌లితాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి ఢిల్లీలో.. క్ర‌మంగా కేసులు త‌గ్గుముఖంప‌ట్టాయి.. ఇవాళ‌ మీడియాతో మాట్లాడిన సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీలో క్రమక్రమంగా కోవిడ్ కేసులు త‌గ్గుతున్నాయ‌ని.. గ‌త 24 గంటల్లో 6,500 కొత్త కోవిడ్ కేసులు మాత్ర‌మే నమోదు అయిన‌ట్టు తెలిపారు.. దీంతో.. క‌రోనా కేసుల పాజివిటీ రేటు 11 శాతానికి త‌గ్గిన‌ట్టు వెల్ల‌డించారు.. మ‌రోవైపు.. 15 రోజుల్లో 1,000 ఐసీయూ బెడ్లతో తాత్కాలిక ఆస్పత్రి ఏర్పాటు చేసిన‌ట్టు తెలిపారు.. దీని వెనుక త‌మ వైద్యులు, ఇంజినీర్ల కృషి ఎంతో ఉందంటూ ప్ర‌శంసించారు సీఎం అర‌వింద్ కేజ్రీవాల్.