Site icon NTV Telugu

IAS Officers Transferred: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..

Ias Officers

Ias Officers

IAS Officers Transferred: ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్‌ అధికారులను భారీ ఎత్తున బదిలీ చేసింది వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్… ఒకేసారి ఏకంగా 57 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది.. 8 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది.. త్వరలోనే పెత్తు స్థాయిలో ఐఏఎస్‌ల బదిలీలు ఉంటాయనే ప్రచారం జరుగుతూ వచ్చింది.. దానికి అనుగుణంగా ఈ రోజు భారీగా ట్రాన్స్‌ఫర్స్‌ జరిగాయి..

ఇక, బదిలీల విషయానికి వస్తే..
* మైనార్టీ సంక్షేమ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా అనంతరాము.
* హెచ్‌ఆర్డీ డీజీగా ఆర్పీ సిసోడియా
* ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు మెంబర్‌ సెక్రటరీగా బి శ్రీధర్‌
* ఢిల్లీ ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా సౌరభ్‌ గౌర్‌.
* ఢిల్లీలోని ఏపీ భవన్‌ ముఖ్య రెసిడెంట్‌ కమిషనర్‌ బాధ్యతల నుంచి ఆదిత్యనాధ్‌ దాస్‌ రిలీవ్..
* ఐటీ శాఖ సెక్రటరీగా కోన శశిధర్‌
* శాప్‌ ఎండీగా కె. హర్షవర్దన్‌.
* ఎస్సీ కమిషన్‌ సెక్రటరీగా హర్షవర్దన్‌కు అదనపు బాధ్యతలు
* కార్మిక శాఖ కమిషనర్‌గా శేషగిరిబాబు
* కార్మిక శాఖ సెక్రటరీగా హరి జవహర్‌ లాల్‌
* ఏపీఐఐసీ ఎండీగా ప్రవీణ్‌ కుమార్‌
* పరిశ్రమల శాఖ కమిషనర్‌గా.. మారీటైమ్‌ బోర్డు సీఈఓగా ప్రవీణ్‌ కుమార్‌కు అదనపు బాధ్యతలు
* దేవదాయ శాఖ కమిషనర్‌గా ఎస్‌ సత్యనారాయణ.
* దేవదాయ శాఖ సెక్రటరీగా సత్యనారాయణకు అదనపు బాధ్యతలు.
* స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్‌ ఎండీగా బసంత్‌ కుమార్‌
* పీఆర్‌ అండ్‌ ఆర్డీ కమిషనర్‌గా సూర్యకుమారి
* కాకినాడ మున్సిపల్ కమిషనర్ గా రమేష్ కుమార్ రావిరాల
* ల్యాండ్ అండ్ సర్వే సెటిల్మెంట్ అడిషనల్ డెరైక్టర్ గా గోపాల కృష్ణ ఆర్.
* తిరుపతి మున్సిపల్ కమిషనర్ బాధ్యతల నుంచి అనుపమ అంజలిని పక్కకు తప్పించిన ప్రభుత్వం.. జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశం
* తిరుపతి మున్సిపల్ కమిషనర్ గా నారపు రెడ్డి మౌర్యకు బాధ్యతలు
* సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ గా కల్పనా కుమారి
* మున్సిపల్‌ శాఖ కమిషనర్‌, డైరెక్టరుగా కోటేశ్వరరావు
* ఏపీ జెన్కో ఎండీగా కేవీఎన్‌ చక్రధర్ బాబు
* ట్రాన్స్‌ కో జేఎండీగా చక్రధర్‌ బాబుకు అదనపు బాధ్యతలు
* నెల్లూరు కలెక్టర్‌గా హరినారాయణ్‌
* విజయనగరం కలెక్టర్‌గా నాగలక్ష్మీ
* సీసీఎల్‌ఏ జాయింట్‌ సెక్రటరీగా ప్రభాకర్‌ రెడ్డి
* చిత్తూరు కలెక్టర్‌గా షాగిలి షన్‌ మోహన్‌
* కర్నూలు కలెక్టర్‌గా ఎస్‌ సృజన
* సోషల్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌గా కే. విజయ
* బాపట్ల కలెక్టర్‌గా రంజిత్‌ భాషా
* జీఏడీకి రిపోర్ట్‌ చేయాలని క్రైస్ట్‌ కిషోర్‌ కుమార్‌కు ఆదేశం.
* సత్యసాయి జిల్లా కలెక్టర్‌గా అరుణ్‌ బాబు
* అనంతపురం కలెక్టర్‌గా గౌతమి
* ఏలూరు జిల్లా జేసీగ లావణ్య వేణి
* స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా విజయ సునీత
* పార్వతిపురం మన్యం జిల్లా జేసీగా ఏ.సిరి.
* గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా వెంకట మురళి
* పశ్చిమ గోదావరి జిల్లా జేసీగా ఎస్‌. రామసుందర్‌ రెడ్డి
* జీవీఎంసీ కమిషనర్‌గా సాయికాంత్‌ వర్మ
* జీఏడీకి రిపోర్ట్‌ చేయాల్సిందిగా తమీమ్‌ అన్సారియాకు ఆదేశం
* ప్రకాశం జిల్లా జేసీగా చామకూర శ్రీధర్‌
* ఏపీ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌గా వెంకటేశ్వర్‌.ఎస్‌
* ఏపీ స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్పోరేషన్‌ ఎండీగా వినోద్‌ కుమార్‌
* ఉపాధి, శిక్షణ సంస్థ డైరెక్టర్‌గా బి. నవ్య.
* ఎన్టీఆర్‌ జిల్లా జేసీగా సంపత్‌ కుమార్‌.
* వైఎస్సార్‌ జిల్లా జేసీగా గణేష్‌ కుమార్‌
* సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ గా వీరపాండ్యన్
* ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ గా సురేష్ కుమార్
* ఆర్ధిక శాఖ డిప్యూటీ కార్యదర్శిగా అభిషిక్త్ కుమార్ కు బాధ్యతలు
* చిత్తూరు జేసీగా శ్రీనివాసులు
* కర్నూలు జేసీగా వికాస్ మర్మత్
* పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ గా వి. అభిషేక్
* పాడేరు సబ్ కలెక్టర్ గా అదనపు బాధ్యతలు

Exit mobile version