Site icon NTV Telugu

YSRCP: వైసీపీకి షాక్‌.. మూకుమ్మడి రాజీనామాలు..!

Ysrcp

Ysrcp

ఉన్నట్టుండి పెద్ద సంఖ్యలు నేతలు, కార్యకర్తలు అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయడం చర్చగా మారింది.. దీంతో, తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలినట్టు అయ్యింది.. ఇక, వైసీపీ జిల్లా అధ్యక్షులు, స్థానిక ఎమ్మేల్యే జక్కంపూడి రాజా సొంత నియోజకవర్గంలోని గాదరాడలో ఈ మూకుమ్మడి రాజీనామాలు హాట్‌ టాపిక్‌గా మారిపోయింది..

Read Also: Astrology: మే 26, గురువారం దినఫలాలు

గాదరాడ ఎంపీటీసీ బత్తుల వెంకట లక్ష్మి ఆధ్వర్యంలో 500 మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు మూకుమ్మడి రాజీనామాలు చేశారు.. అధికార పార్టీలో ఉండి కూడా ప్రజలకు సేవలందించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.. సమస్యలను ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని మండిపడుతున్నారు.. గాదరాడ గ్రామంలో త్రాగునీరు, విద్యుత్ సదుపాయలు పూర్తిగా కల్పించలేదని పేర్కొన్న నేతలు.. అధికార పార్టీలో ఉండి కూడా ప్రజలకు సేవ చేయలేనప్పుడు పార్టీలో కొనసాగడం అనవసరమని భావించి రాజీనామా చేసినట్టు ప్రకటించారు.

Exit mobile version