30 Years Prudhvi: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ కాల్ వీడియో ఒరిజినల్ కాదంటూ అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ప్రకటించినా ఈ అంశంపై విమర్శలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్ స్పందించి ఈ అంశంపై విచారణ చేపట్టి రిపోర్టు ఇవ్వాలని ఏపీ డీజీపీని ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు గోరంట్ల మాధవ్ వీడియోపై వైసీపీ మాజీ నేత, ప్రముఖ సినీ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ స్పందించారు. అంగబలంతో పాటు అర్థబలం కూడా ఉండటంతోనే గోరంట్లను వైసీపీ నేతలు వెనకేసుకుని వస్తున్నారని పృథ్వీరాజ్ ఆరోపించారు. ఈ వీడియోపై గోరంట్ల మాధవ్ స్పందించిన తీరు కూడా వైసీపీ నేతలకు నచ్చినట్టుగా ఉందని చురకలు అంటించారు. ఇంతటి దౌర్భాగ్యం గతంలో ఎన్నడూ చూడలేదన్నారు.
Read Also: Kodali Nani: లింగ పరిశోధనలో టీడీపీ వాళ్లు నిష్ణాతులా? మాధవ్‌ది పట్టుకుని ఎందుకు వేలాడతారు?
పార్లమెంటులో తెలుగు ఎంపీలకు ఇప్పటివరకు ఓ మంచి చరిత్ర ఉండేదని.. కానీ గోరంట్ల వీడియో కారణంగా ఆ చరిత్ర మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని పృథ్వీరాజ్ ఆరోపించారు. గోరంట్ల వ్యవహారంలో వారం పాటు మీడియా సమావేశాలు పెట్టిన నేతలు ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు. అనంతపురం ఎస్పీ చెబుతున్న విషయాలు ఒకదానితో మరొకటి పొంతన లేకుండా ఉన్నాయన్నారు. అసలు ఆ వీడియో ఫేక్ అని ఎలా తేలుస్తారో తనకు అర్థం కావడం లేదన్నారు. ఎవరెన్ని చెప్పినా ప్రజలు ఆ మాత్రం అవగాహన చేసుకోకుండా ఉండలేరా అని అభిప్రాయపడ్డారు. కాగా పృథ్వీరాజ్ ఇటీవల జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో ఎస్వీబీసీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో పృథ్వీరాజ్‌పైనా మహిళలతో రాసలీలల వ్యవహారంపై విమర్శలు వచ్చాయి. అప్పట్లో ఆ విమర్శలు సంచలనం రేకెత్తించాయి.
