NTV Telugu Site icon

South Central Railway: ప్రయాణికులకు శుభవార్త.. సంక్రాంతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు

Special Trains

Special Trains

South Central Railway: సంక్రాంతి రద్దీని దృష్టిని పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు మరో 30 అదనపు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. జనవరి 1 నుంచి 20వ తేదీ మధ్యలో ఈ ప్రత్యేక రైళ్లను వివిధ ప్రాంతాల మధ్య నడపనున్నట్లు తెలిపారు. ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, కాచిగూడ, వికారాబాద్‌ నుంచి నర్సాపూర్‌, మచిలీపట్నం, కాకినాడ మార్గంలో ఈ ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు. ఆయా రైళ్లలో రిజర్వుడ్, అన్ రిజర్వుడ్ బోగీలను అందుబాటులో ఉంచనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్ధం రాత్రి సమయాల్లో ఈ రైళ్లు నడుస్తాయి.

Read Also: Cell Phones Robbery: పోలీస్ డ్రెస్ లో వచ్చి… సెల్ ఫోన్స్ చోరీ

కాగా జనవరి 9న సికింద్రాబాద్‌ – కాకినాడ టౌన్‌, 10న కాకినాడ టౌన్‌ – వికారాబాద్‌, 11న వికారాబాద్‌ – నరసాపూర్‌, సికిందాబ్రాద్‌ – కాకినాడ టౌన్‌, 12న నరసాపూర్‌ – సికింద్రాబాద్‌, కాకినాడ టౌన్‌ – వికారాబాద్‌, 13న వికారాబాద్‌ – కాకినాడ టౌన్‌, సికింద్రాబాద్‌ – నరసాపూర్‌, 14న కాకినాడ టౌన్‌ – సికింద్రాబాద్‌, నరసాపూర్‌ – సికింద్రాబాద్‌, 15న సికింద్రాబాద్‌ – కాకినాడ టౌన్‌, 16న సికింద్రాబాద్‌ – కాకినాడ టౌన్‌, కాకినాడ టౌన్‌ – వికారాబాద్‌, 17న కాకినాడ టౌన్‌ – సికింద్రాబాద్‌, వికారాబాద్‌ – కాకినాడ టౌన్‌, 18న కాకినాడ టౌన్‌ – సికింద్రాబాద్‌ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ రైళ్లకు ఈ నెల 31వ తేదీన ఉదయం 8 గంటల నుంచి అడ్వాన్స్‌డ్‌ రిజర్వేషన్‌ సౌకర్యం ప్రారంభం కానుంది. ఈ రైళ్లకు నడికుడి, సత్తెనపల్లిలో హాల్టింగ్ ఉంటుంది. సంక్రాంతి ప్రత్యేక రైళ్లలో ప్రయాణించాలనుకుంటేపీఆర్‌ఎస్‌ కౌంటర్లతో పాటు ఐఆర్‌సీటీసీ యాప్‌ లేదా వెబ్‌సైట్‌లో రిజర్వుడ్‌ టిక్కెట్లను బుకింగ్‌ చేసుకోవచ్చని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. జనరల్‌ బోగీలలో ప్రయాణించదలిస్తే రైల్వేస్టేషన్లలో టిక్కెట్‌ కౌంటర్ల వద్ద రద్దీ దృష్ట్యా యూటీఎస్‌ మొబైల్‌ యాప్‌ని వినియోగించి బుకింగ్‌ చేసుకోవాలని సూచించారు.

Show comments