Site icon NTV Telugu

సీజేకు న్యాయ‌వాదుల లేఖలు‌.. సుమోటోగా స్వీకరించిన ఏపీ హైకోర్టు

AP High Court

క‌రోనా సెకండ్ వేవ్‌లో పాజిటివ్ కేసుల‌తో పాటు మృతుల సంఖ్య క‌ల‌వ‌ర‌పెడుతోంది.. ఇక‌, కొన్ని ఆస్ప‌త్రుల్లో స‌రైన చికిత్స అంద‌క‌, ఆక్సిజ‌న్ లేక కోవిడ్ బాధితులు ప్రాణాలు విడ‌వ‌డం ఆందోళ‌న‌కు గురి చేస్తోంది.. అయితే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా చికిత్సలో లోపాలు, ఆక్సిజన్ అందక జరిగిన మరణాలపై పరిహారం ఇవ్వాలని హైకోర్టు సీజేకి న్యాయవాదులు లేఖ రాశారు.. న్యాయ‌వాదులు రాసిన మూడు లేఖలు హైకోర్టు సీజేకు చేర‌గా.. ఆ లేఖ‌ల‌ను సుమోటోగా విచార‌ణ‌కు స్వీకరించింది ఏపీ హైకోర్టు.. వాటిపై విచారణను వచ్చే సోమవారం చేపట్టనున్న‌ట్టు హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇప్ప‌టికే.. క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌లు, చికిత్స‌, మృతుల సంఖ్య పెర‌గ‌డంపై వ‌రుస‌గా కోర్టులు ఆయా ప్ర‌భుత్వాల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

Exit mobile version