Site icon NTV Telugu

AP: వైసీపీ కార్యకర్తలకు ప్రత్యేకం.. మూడు ప్రాంతాల్లో మెగా జాబ్‌ మేళా..

ఆంధ్రప్రదేశ్‌లో జాబ్‌ మేళాలు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు… రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు మెగా జాబ్‌ మేళాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.. దీనికి సంబంధించిన తేదీలను ప్రకటించారు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. ఏప్రిల్‌ 16, 17 తేదీల్లో తిరుపతిలోని వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జాబ్ మేళా ఉంటుందని.. కనీసం 5 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.. పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలు, అభిమానుల కోసమే ఈ జాబ్ మేళా పెడుతున్నామని.. పూర్తిగా పార్టీ తరపున చేపడుతున్న కార్యక్రమని తెలిపారు సాయిరెడ్డి.

Read Also: Ugadi 2022: ‘శుభకృత్’నామ సంవత్సరంలో అందరికీ శుభాలు కలగాలి-కేసీఆర్‌

ఇక, ఏప్రిల్‌ 23, 24 తేదీల్లో ఆంధ్ర యూనివర్సిటీలో.. ఏప్రిల్‌ 30, మే 1వ తేదీల్లో నాగార్జున యూనివర్సిటీలో జాబ్ మేళాలు జరగనున్నాయి తెలిపారు విజయసాయిరెడ్డి.. తిరుపతి జాబ్ మేళాకు రాయలసీమ వారికి, ఆంధ్ర యూనివర్సిటీలో ఉత్తరాంధ్ర జిల్లాలలతో పాటు తూర్పు గోదావరి జిల్లా వారికి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల వారు నాగార్జున యూనివర్సిటీలో హాజరు కావాలని సూచించారు.. మొత్తంగా మూడు జాబ్ మేళాల్లో 15 నుంచి 20 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని వివరించిన విజయసాయిరెడ్డి.. స్పాట్‌లోనే ఇంటర్వ్యూ, ఎంపిక అయితే వెంటనే నియామక పత్రాలు అందజేయనున్నట్టు వెల్లడించారు.

Exit mobile version